WorldWonders

అక్కడ రాక్షస వివాహమే ఆచారం

Kidnapping and marrying others wives in west africa is a tradition

మన దేశంలో పెద్దలు కుదిర్చిన వివాహమైనా.. ప్రేమ పెళ్లి అయినా.. ఎవరైనా జీవితాంతం ఒకరికి ఒకరు తోడుగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. వారి బంధం కలకాలం బలంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అందుకోసం ఎన్నో కలలు కంటూ ఉంటారు. అయితే మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో వివిధ పెళ్లిళ్లు ఆచారాలు ఉన్నాయి. ఎన్ని ఆచారాలు, సంప్రదాయాలు కట్టుబాట్లు ఉన్నప్పటికీ అంతిమంగా భార్య,భర్తలిద్దరూ కలిసే జీవిస్తారు. అయితే ఇలాంటి వివాహానికి సంబంధించి విదేశాల్లోనూ దాదాపుగా ఇలాంటి ఆచారమే కొనసాగుతుంది. అయితే వారిలో వివాహం చేసుకున్న వారు కొన్ని నెలలకో లేదా కొన్ని సంవత్సరాలలోపే విడాకులు తీసుకుని విడిపోతుంటారు. ఇదంతా ఒక ఎత్తయితే.. ఓ దేశంలో నివసించే తెగ వారు తమకు వివాహం కావాలంటే.. లేదా వివాహం అయినప్పటికీ.. వేరే వారి భార్యలను ఎత్తుకెళ్లి మరీ పెళ్లి చేసుకుంటారట. అది అక్కడి వారి ఆచారమట. వినడానికి వింతగా అనిపించినా ఇది నిజమే. ఈ ఆచారాన్ని వారు ఇప్పటి నుండి కాదు తమ పూర్వీకుల కాలం నాటి ఆచారిస్తూ వస్తున్నారట. ఈ విచిత్రమైన వివాహ ఆచారం గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం…
** పశ్చిమ ఆఫ్రికాలో..
ఆఫ్రికా ఖండంలో ఇప్పటికీ అడవిలో కొన్ని తెగల జాతుల వారు నివసిస్తున్నారు. ఆఫ్రికాలోని వోడాబ్బే తెగ ప్రజలు తమ పూర్వీకుల ఆచారాన్ని నేటి ఆధునిక యుగంలోనూ అనుసరిస్తూ ఔరా అనిపించుకుంటున్నారు. ఇతర పురుషులు పెళ్లి చేసుకున్న వారి భార్యలను ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకోవడమే వీరి ఆచారమట. ఈ ఆచారం ప్రకారం.. వొడాబ్బే తెగ ప్రజల ఆచారం ప్రకారం, ఓ వ్యక్తి యొక్క మొదటి వివాహం వారి కుటుంబ సభ్యుల ఎంపిక ద్వారా జరుగుతుందట. కానీ పురుషులు మరొకరి భార్యను ఎత్తుకెళ్లడం ద్వారా రెండో వివాహాన్ని కూడా చేస్తారట.
** గెరెవోల్ పండుగ..
ఆఫ్రికాలో నివసించే ఈ జాతి ప్రజలు ప్రతి సంవత్సరం గెరెవోల్ పండుగను నిర్వహిస్తారట. ఈ పండుగలో అబ్బాయిల ముఖం మీద పెయింట్ వేసుకుంటారట. ఈ సమయంలోనే వివాహిత మహిళలను ఆకర్షించడానికి శతవిధాలా ప్రయత్నిస్తారట. అమ్మాయిలు ఇష్టపడితే.. అలా వారి ప్రయత్నాలకు ఎవరైతే ఆకర్షితులై ఓకే చెప్తారో వెంటనే వారితో కలిసి పారిపోతారట. అలా పారిపోయిన గిరిజనులు ఇద్దరు వివాహం కూడా చేసుకుంటారట. వారిని ఆ సమాజంలో ప్రేమ వివాహంగా ఒప్పుకుంటారట.
**మన దేశంలోనూ..
మన దేశంలోనూ బీహార్ వంటి రాష్ట్రంలో ఇప్పటికీ కొన్ని మారుమూల గ్రామాల్లో ఇలాంటి ఆచారమే ఒకటుంది. అయితే దాని పేరు ‘రాక్షస వివాహం‘. రాక్షాస వివాహం.. ఈ ఆచారం ప్రకారం వరుడిని దొంగతనంగా ఎత్తుకెళ్లి.. వారికి ఇష్టమైన వధువుతో తాళి కట్టిస్తారట. ఒకవేళ ఆ వరుడికి ఇష్టం లేకపోతే బలవంతంగా బెదిరించి మరీ పెళ్లి చేస్తారట. దీనినే రాక్షాస వివాహం అంటారు