చేసినవి రెండు సినిమాలే అయినా మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిపోయింది తార సుతారియా. 2010లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా టెలివిజన్ రంగంలో అడుగుపెట్టింది. పోయినేడు ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2’తో బాలీవుడ్‌లో ఎంటరయ్యింది. పునీత్ మల్హోత్రా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అయి తారాని తారస్థాయికి తీసుకెళ్లింది. వెంటనే మిలాప్ జవేరీ దర్శకత్వంలో ‘మర్జావా’తో వచ్చింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా తారాకి మాత్రం మంచి పేరే తెచ్చింది. ప్రస్తుతం మిలన్ లూథ్రియా దర్శకత్వంలో సాజిద్ నడియాడ్‌వాలా నిర్మిస్తున్న టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘ఆర్.ఎక్స్.100’ రీమేక్‌లో లీడ్ రోల్‌కి తారను తీసుకున్నారట. ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తవ్వకుండానే తార ‘ఏక్ విలన్ 2’లో మంచి ఆఫర్ పట్టేసింది. ‘ఏక్ విలన్’ సినిమాకి ఇది సీక్వెల్. మోహిత్ సూరి దర్శకత్వంలో 2014లో వచ్చిన ‘ఏక్ విలన్’ సూపర్ డూపర్ హిట్టయ్యింది. దీనిలో రితేష్ దేశ్‌ముఖ్, సిద్ధార్థ మల్హొత్రా, శ్రద్ధా కపూర్ లీడ్ రోల్స్ చేశారు. సీక్వెల్‌లో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. ఒకరు దిశాపటాని, రెండో హీరోయిన్‌గా తారను సెలెక్ట్ చేశారు. ఆదిత్యా కపూర్‌కి జోడీగా తార, జాన్ అబ్రహామ్‌కి జోడీగా దిశ కనిపించనున్నారు. ఏక్తా కపూర్, భూషణ్ కుమార్‌లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో సింగర్‌గా కనిపిస్తుందిట తార. కానీ నిజంగానే సినిమాలో తనే పాడేందుకు ట్రైనింగ్ తీసుకుంటూ ప్రాక్టీసు కూడా చేస్తోందట. ‘డైరెక్టర్ అడిగింది చెయ్యడమే ఆర్టిస్ట్ కర్తవ్యం’ అని కూడా అంటోంది. ‘‘ఈ సినిమాలో ఆమె రోల్ ఎలా ఉండాలి అనుకున్నానో అలాగే తను కూడా చేస్తోంది’’ అంటూ తార హార్డ్ వర్క్ చూసి మోహిత్ సూరి కూడా తెగ ఇంప్రెస్ అయిపోతున్నాడట. అంత కష్టపడుతోంది కాబట్టే మంచి సినిమాలు వస్తున్నాయేమో అంటున్నారంతా.
సుతారియా ఛాన్స్ మిల్‌గయా
Related tags :