ఊహించినట్టే జరిగింది. కరోనా మహమ్మారి తీవ్రతకు అతిపెద్ద క్రీడా సమరం ఒలింపిక్స్ వాయిదా పడింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా ఈ ఏడాది జపాన్ రాజధాని టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్స్‌ను వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య (ఐఓసీ) ప్రకటించింది. జపాన్ ప్రధాని షింజో అబే విజ్ఞప్తి మేరకు ఒలింపిక్స్‌ను ఏడాది పాటు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ‘‘ఒలింపిక్స్‌ను ఏడాది పాటు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశాను. ఐఓసీ అధ్యక్షుడు బాచ్ దీన్ని అంగీకరించారు’’అని షింజో మీడియాకు తెలిపారు. కరోనా వైరస్ భయంతో ఒలింపిక్స్‌ను వాయిదా వేయాలని సభ్యదేశాలు ఒత్తిడి తెచ్చిన సంగతి తెలిసిందే.
2021 వరకు టొక్యో ఒలంపిక్స్ వాయిదా

Related tags :