కొరోనా నేపథ్యంలో ప్రపంచం అంతా లాక్డౌన్లు విధిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వైరస్ మహమ్మారి కట్టడి చర్యల్లో భాగంగా కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్ నగర పోలీసులు ఒక వ్యక్తికి ₹30వేల జరిమానా విధించారు. ఉదయానే ఫ్రీమాంట్ నగరంలో నడకకు ఉపక్రమించిన ఓ వ్యక్తికి అదే దారిలో నడుస్తున్న మరో వ్యక్తి తారసపడగా ఇరువురూ సంభాషించుకుంటున్నారు. ఇది గమనించిన స్థానిక పోలీసులు వారు బంధువులు, స్నేహితులు, ఒకే గృహంలో నివసించట్లేదని విచారించి తెలుసుకుని, 6అడుగుల దూరం పాటించాలనే నిబంధన ఉల్లంఘించినందుకు $400(₹30వేలు) జరిమానా విధించారు. కలికాల వింతలు ఇంకా ఎన్ని చూడాలో!
ఆరడుగులు దూరం పాటించలేదని ₹30వేల జరిమానా

Related tags :