కరోనా వైరస్ నేపథ్యంలో ప్రముఖ కథానాయకులు రజనీకాంత్, విజయ్ సేతుపతి కళాకారులను ఆదుకోవడానికి ముందుకొచ్చారు. ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (ఎఫ్ఈఎఫ్ఎస్ఐ) సంఘానికి ఒకొక్కరు రూ.50 లక్షలు చెప్పునా విరాళం ప్రకటించారు. కొవిడ్-19 కారణంగా దేశవ్యాప్తంగా సినిమా షూటింగ్లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. చిత్రీకరణ అంటే వందల మందితో కూడుకున్న వ్యవహారం కావడంతో వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లాక్డౌన్ ప్రకటించాయి. దీంతో ఎఫ్ఈఎఫ్ఎస్ఐకు చెందిన చిన్న స్థాయి కళాకారులు ఆర్థిక సమస్యలతో సతమతమౌతున్నారు. సంఘంలో 25,000 మంది కళాకారులు సభ్యులుగా ఉన్నారని, వారిలో 15,000 మంది కనీసం నిత్యావసర సరకులు కొనేందుకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారని ఎఫ్ఈఎఫ్ఎస్ఐ సంఘం అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి మీడియాకు తెలిపారు. సినీ ప్రముఖులు తమ వంతు సహాయం చేయాలని కోరారు. విరాళాలు ఇస్తే కనీసం బియ్యం బస్తాలు కొని ఇస్తామని చెప్పారు. దీంతో సోమవారం సాయంత్రం సూర్య, కార్తి, శివ కుమార్ కలిసి రూ.10 లక్షలు విరాళం ఇచ్చారు. మంగళవారం రజనీ, విజయ్ దాతృత్వం చాటుకున్నారు.
కొరోనా బాధితులకు ₹కోటి
Related tags :