కరోనా వైరస్ నియంత్రణకు దేశమంతా 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించినప్పటికీ కొందరు ప్రజలు రోడ్లపై తిరుగుతూనే ఉన్నారు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వస్తోంది. తమిళనాడులోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఓ ట్రాఫిక్ పోలీస్ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తులకు ఇంట్లోనే ఉండాలని కోరుతూ కౌన్సెలింగ్ ఇస్తూ కనిపించారు. చేతులెత్తి వారికి నమస్కారం కూడా పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. పోలీస్ అధికారి అయినప్పటికీ ఓపికగా నిల్చుని వాహనదారులకు నచ్చజెప్పడం గొప్ప విషయమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వీడియో చూసిన నటుడు మాధవన్ స్పందించారు. ‘తమిళనాడు పోలీసులు అన్ని విధాలుగా రిస్క్ చేసి.. మనలోని కొంతమంది ఇడియట్ బ్రదర్స్‌ను ఇంటి వద్ద ఉండాలని వేడుకుంటున్నారు. పోలీసులపై నాకు గౌరవం పెరిగింది. ఆయనకు నా నమస్కారాలు. మేం మీకు రుణపడి ఉన్నాం. ఈ ఘటన నా మనసును కదిలించింది’ అని ఆయన పోస్ట్ చేశారు.
ఒరేయి….మీకు దణ్ణం పెడతా….ఇంట్లోనే ఉండండి
Related tags :