Movies

21రోజుల్లో తెలుగు నేర్చుకోండి

Actress Payal Rajput Telugu Movie Latest News

హోమ్ క్వారంటైన్ టైమ్‌లో త‌మ‌లోని కొత్త క‌ళ‌ల‌కు మెరుగులు దిద్దుకోవ‌డ‌మే కాకుండా లోపాల‌ను అధిగ‌మించేందుకు క‌థానాయిక‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. లాక్‌డౌన్ కార‌ణంగా షూటింగ్‌లు ర‌ద్దు కావ‌డంతో ఈ విరామ స‌మ‌యంలో తెలుగు భాష‌పై ప‌ట్టు సాధించే ప‌నిలో ఉంద‌ట పాయ‌ల్ రాజ్‌పుత్‌. ఇన్నాళ్లు షూటింగ్‌ల‌తో బిజీగా ఉండ‌టంతో తెలుగు నేర్చుకోవ‌డం కుద‌ర‌క‌పోవ‌డంతో ఈ విరామ స‌మ‌యాన్ని స‌ద్వినియోగ ప‌రుచుకునేందుకు ప్ర‌ణాళిక‌ల్ని సిద్ధం చేసుకుంటున్న‌ట్లు తెలిసింది. ప్ర‌త్యేకంగా శిక్ష‌కుడిని నియ‌మించుకొని తెలుగు ప‌దాలు స్ప‌ష్టంగా ప‌ల‌క‌డంపై దృష్టిసారిస్తున్న‌ట్లు చెబుతున్నారు. సొంతంగా డ‌బ్బింగ్ చెప్పుకోవాల‌నే ఆలోచ‌న‌తో పాటు తెలుగులో క‌థానాయిక‌గా పూర్తిస్థాయిలో నిల‌దొక్కుకోవాల‌నే పాయ‌ల్ తెలుగు నేర్చుకుంటున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం పాయ‌ల్ రాజ్‌పుత్ తెలుగులో ఫైవ్ డ‌బ్య్లుఎస్ అనే సినిమాలో న‌టిస్తున్న‌ది. మ‌హిళా ప్ర‌ధాన ఇతివృత్తంతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ఆమె ఐపీఎస్ అధికారిణిగా క‌నిపించ‌బోతున్న‌ది.