NRI-NRT

తెలుగు విద్యార్థులకు లండన్ ప్రవాసుల సహకారం

London Telugu NRI NRTs Helped Students Stuck In London

కొరోనా వైరస్ నేపథ్యంలో లండన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు అక్కడి స్థానిక తెలుగు సంఘాలు బాసటగా నిలిచాయి. 20వ తేదీన వీరు ప్రయాణించాల్సిన విమానం రద్దు కావడంతో 31వ తేదీ వరకు వీరికి వసతి, భోజన ఏర్పాట్లను ఈ సంస్థలు అందజేస్తున్నాయి. తెలంగాణ ఎన్నారై ఫోరమ్, లండన్ తెలుగు సంఘం, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్, యుక్త, వాసవి క్లబ్ ఇంగ్లాండ్, తెలంగాణ జాగృతి, ఒయాసిస్ అకౌంట్స్, హైదరాబాద్ బావార్చి తదితర సంస్థలు ఈ విద్యార్థులకు సహకరిస్తున్నాయని గంప వేణుగోపాల్, ప్రమోద్ గౌడ్, రాములు, శ్రీధర్ సోమిశెట్టి, కమలాకరరావు, శ్రవణ్ గౌడ్, శ్రీనివాస్, ఏపీ ప్రత్యేక ప్రతినిధి కందుల రవీంద్రరెడ్డి తదితరులు ఓ ప్రకటనలో తెలిపారు.