NRI-NRT

కొరోనా కారణంగా అంతర్జాలంలో టాంటెక్స్ సాహిత్య సదస్సు

Texas Telugu NRI NRT News-TANTEX Conducts Literary Meet Via Internet Due To COVID19

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో 152 వ నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు కృష్ణారెడ్డి కోడూరు ఆధ్వర్యంలో డల్లాస్‌లో ఘనంగా నిర్వహించారు. కరోన వైరస్ కారణంగా మొదటిసారి ఈ సదస్సుని ఆన్ లైన్ లో నిర్వహించారు. సాహిత్య-సింధు రఘుపతి రక్షకుడనీ ప్రార్థనా గీతంతో కార్యక్రమం ప్రారంభమైంది. యు.నరసిమ్హారెడ్డి “మన తెలుగు సిరిసంపదలు”, సత్యం ఉపద్రష్ట చమత్కార కవిత్వం, లెనిన్ సంస్కృతంలో ఆధ్యాత్మిక సాహిత్యం, లౌకిక సాహిత్యం, గణిత శాస్త్రం, లలితానంద్ కరోనా ధిక్కారం కవిత, డా.ఉమాదేవి భాగవత శ్లోకాన్ని, ముఖ్యఅతిధి రమణరావు “తెలుగుకథా పరిణామం”పై ప్రసంగించారు. డా.రమణరావు సతీమణి సుభద్ర “కొమ్మలో కోయిలా కుహూ అంటదీ” అనే లలిత గీతంతో కార్యక్రమాన్ని ముగించారు. ఈ అంతర్జాల కార్యక్రమంలో పూర్వాధ్యక్షులు సుబ్రమణ్యం జొన్నలగడ్డ,చంద్ర కన్నెగంటి,రాయవరం భాస్కర్, సురేష్ కాజా,ప్రసాద్ తోటకూర,కిరణ్మయి గుంట,చిన సత్యం వీర్నపు,రవి పట్టిసం,శశికళా పట్టిసం,రాజా రెడ్డీ,పివి రమారావు,విష్ణు ప్రియ,జగదీశ్వరన్ పూదూరు తదితరులు పాల్గొన్నారు. తిరుమలరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.