బూట్లు లేదా చెప్పుల మీద పేరుకుపోయిన దుమ్మూ, ధూళిని శుభ్రం చేసుకుని తళతళలాడేలా పాలిష్ కూడా చేసుకుంటాం. బూట్ల లోపలి భాగం గురించి అంతగా పట్టించుకోం. కానీ ఎక్కువసేపు బూట్లు వేసుకునే ఉండటం వల్ల బాగా చెమట్లు పట్టి లోపలి నుంచి ఒకలాంటి దుర్గంధం వస్తుంటుంది. అలాంటప్పుడు అక్కడ ఉండే కనిపించని వైరస్, బ్యాక్టీరియాలను నాశనం చేయడానికి ఉపయోగపడేదే ఈ ‘షూ శానిటైజర్’. ఏ సైజు బూట్లనైనా దీంతో శుభ్రం చేసుకోవచ్ఛు పాదాలను పరిశుభ్రంగా ఉంచుకుని ఎన్నో రకాల అనారోగ్యాల బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్ఛు.
ఇవి బూట్ల కంపు పోగొడతాయి
Related tags :