నందమూరి బాలయ్య మళ్లీ డీలా పడ్డారు. ఆయనకు వరుస పరాజయాలు రావడంతో అటు ఫ్యాన్స్ కూడా కాస్త అసహనంలో ఉన్నారు. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని బాలయ్య అనుకుంటున్నారు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తుండగా.. ఈ మూవీ తరువాత సెన్సేషనల్ దర్శకుడికి అవకాశం ఇవ్వాలని ఆయన అనుకుంటున్నారట. ఈ క్రమంలో ఆ దర్శకుడికి ఇటీవల బాలయ్య టీమ్ నుంచి ఫోన్ వచ్చినట్లు తెలుస్తోంది.
అసలు మ్యాటర్ ఏంటంటే.. వరుసగా ఐదు విజయాలతో టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెండ్ దర్శకుడిగా మారారు అనిల్ రావిపూడి. ప్రస్తుతం ఆయన ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. అన్నీ కుదిరితే ఆగష్టు నుంచి ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని ఆయన అనుకుంటున్నారు. ఇది పక్కనపెడితే ఇటీవల బాలయ్య టీమ్ నుంచి అనిల్‌కు ఫోన్ వచ్చిందట. బాలయ్యకు సరిపోయే ఓ కథను సిద్ధం చేయమని ఆ టీమ్.. సెన్సేషనల్ దర్శకుడికి చెప్పిందట. దీంతో కచ్చితంగా మంచి స్క్రిప్ట్‌తో వస్తానని అనిల్.. వారికి మాటిచ్చారట. కాగా అనిల్, బాలయ్యకు పెద్ద అభిమాని. ఈ విషయాన్ని ఆయన పలు సందర్భాల్లో వెల్లడించారు. ఇక బాలయ్యతో సినిమా తీసేందుకు అనిల్ రావిపూడి ఆ మధ్య రామారావు గారు అనే కథను రెడీ చేసినట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లకపోగా.. ఇప్పుడు బాలయ్య నుంచే ఆయనకు కాల్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక అన్నీ కుదిరితే క్రేజీ కాంబోలో ఓ సినిమా రావడం పక్కా అంటున్నారు సినీ అభిమానులు.
రావిపూడితో నందమూరి

Related tags :