ScienceAndTech

క్రెడిట్ కార్డు బిల్లు కట్టాల్సిందే

No Break For Credit Card Bills

క్రెడిట్‌ కార్డు రుణాలు లేదా బకాయిలకు మూడు నెలల మారటోరియం వర్తించదని ఆర్బీఐ స్పష్టం చేసింది.

గృహ, వ్యక్తిగత, వాహన, విద్యా తదితర రుణాలు మాత్రమే టర్మ్‌ లోన్స్‌ పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది. 

ఈఎంఐల చెల్లింపుపై ఆయా బ్యాంకులు ప్రత్యేకంగా మరోసారి మార్గదర్శకాలు విడుదల చేయనున్నాయి. 

టర్మ్ లోన్లపై  అన్ని ఈఎంఐలు  రద్దు చేసినట్లు ఎస్‌బీఐ చీఫ్ రజనీశ్‌ కుమార్ తెలిపారు.

ఈఎంఐలన్నింటిని ఆటోమేటిక్‌గా మూడు నెలల తర్వాత నుంచి కట్టేందుకు వెసులుబాటు కల్పిస్తాయా లేక ఒక్కో వినియోగదారుడికి వేర్వేవేరుగా చెల్లించేందుకు అనుమతినిస్తాయా అనేది తర్వాత వెల్లడించనున్నారు. 

ఆర్బీఐ  రీపేమెంట్‌ షెడ్యూల్‌ ప్రకారం ఇప్పటికే నిర్దేశించిన రుణాల గడువు ముగిసిన తర్వాత  ౩ నెలలు వరకూ ఈఎంఐలు చెల్లించొచ్చు.  

మొబైల్స్‌, ఫ్రిజ్‌, టీవీలు తదితర గృహోపకరణాలపై తీసుకున్న రుణాల ఈఎంఐలపై కూడా 3 నెలల  మారటోరియం వర్తిస్తుంది.

క్రెడిట్‌ కార్డు చెల్లింపులు మారటోరియం పరిధిలోకి రావు.

క్రెడిట్‌ కార్డు పేమెంట్ల టర్మ్‌లోన్ల కింద పరిగణించరు. 

క్రెడిట్‌ కార్డు బిల్లులు చెల్సించాల్సిన అవసరం లేదని ఆర్బీఐ ఎక్కడా పేర్కొనలేదు. 

దీంతో గడువు లోగా ఆయా బిల్లులను వినియోగదారులు తప్పక చెల్లించాల్సిందే. 

మారటోరియం అనేది టర్మ్‌ లోన్‌(హోం, వాహన, వ్యక్తిగత, ఫ్యాక్టీరీలు, ప్రాజెక్టుల కోసం తీసుకున్న రుణాలు)లకు మాత్రమే వర్తిస్తుంది. 

క్రెడిట్‌ కార్డులపై తీసుకున్న రుణాలు మారటోరియం పరిధిలోకి వస్తాయా అనేది దానిపై స్పష్టత లేదు.

ఆర్బీఐ విడుదల చేసే మార్గదర్శకాలతోనే దీనిపై పూర్తి స్పష్టత రానుంది.