కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ప్రపంచ దేశాలన్నింటికి సోకింది. ఈ క్రమంలో పంజాబ్ ప్రావిన్స్ లోని కోవిడ్ బాధితులను పాక్ ఆర్మీ బలవంతంగా పీఓకే, గిల్గిట్ బల్టిస్థాన్ కు పంపిస్తోంది. పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో కరోనా పేషెంట్లు లేకుండా చూడటం కోసం పీఓకేలోని మిర్పూర్, ఇతర ప్రాంతాల్లో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఆర్మీ స్థావరాలు, సైనిక కుటుంబాలకు దగ్గర్లో ఒక్క కోవిడ్ పేషెండ్ కూడా ఉండకూడదని పాక్ ఆర్మీ చీఫ్ ఆదేశాలు జారీ చేశారు. లాక్ చేసిన గూడ్స్ వాహనాల్లో భారీ సంఖ్యలో కోవిడ్ పేషెంట్లను మిర్పూర్ సిటీతోపాటు పీఓకేలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. కాగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో వైద్య నిపుణులు, సదుపాయాలు సరిపడినంత స్థాయిలో లేవు. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజల ప్రాణాలకు ముప్పు కలుగుతుందని వాపోతున్నారు. పాకిస్థాన్‌లో పంజాబ్ ప్రావిన్స్‌కు రాజకీయంగా ప్రాధాన్యత ఉండటంతో ఈ తరహా చర్యలకు పాల్పడుతుందని.. పీవోకే ప్రజలు ఆరోపిస్తున్నారు. చిన్నపాటి వ్యాధులకు చికిత్స అందించడానికే వైద్య వసతులు సరిగ్గా లేనిచోట కోవిడ్ కి ట్రీట్మెంట్ ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పాకీ కుక్కల దుశ్చర్య…
Related tags :