DailyDose

భారత బ్యాంకులు సురక్షితంగా ఉన్నాయి-వాణిజ్యం

RBI Governor ShaktiKanth Das Speaks Of Indian Banks-Telugu Business News Roundup Today

* భార‌తీయ బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ సుర‌క్షితంగా, బ‌లంగా ఉంద‌ని ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ అన్నారు.ఇటీవ‌ల స్టాక్ మార్కెట్ల‌లో వ‌చ్చిన ప్ర‌కంప‌న‌లు బ్యాంకుల షేర్ల‌పై ప‌డిన‌ట్లు ఆయ‌న తెలిపారు.క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో మార్కెట్లు డీలాప‌డ్డాయ‌న్నారు. దీంతో కొంద‌రు డిపాజిట‌ర్లు బ్యాంకుల నుంచి డ‌బ్బును డ్రా చేసుకున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. డిపాజిట్ల భ‌ద్ర‌త‌ను షేర్ల‌తో పోల్చ‌లేమ‌న్నారు. క‌మ‌ర్షియ‌ల్ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకుల డిపాజిట‌ర్లు ఆందోళ‌న చెంద‌వ‌ల‌సిన అవ‌స‌రం లేద‌ని దాస్ అన్నారు.డిపాజిట‌ర్ల సొమ్ము భ‌ద్రంగా ఉన్న‌ట్లు తెలిపారు. ప్రాంతీయ బ్యాంకుల‌తో పాటు అన్ని క‌మ‌ర్షియ‌ల్ బ్యాంకులు, స‌హ‌కార బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు .. ఈఎంఐల‌పై మూడు నెల‌ల మారిటోయం పాటించ‌నున్న‌ట్లు చెప్పారు.క‌రోనా లాక్‌డౌన్‌తో భార‌తీయ ఆర్థిక వ్య‌వ‌స్థ, స్టాక్‌మార్కెట్లు కొంద వ‌త్తిడికి లోనైట్లు చెప్పారు. మునుముందు చాలా గ‌డ్డు రోజులు ఉన్నాయ‌ని, కాగా అవి ఎక్క‌వ రోజులు ఉండ‌వ‌న్నారుకానీ క‌ఠిన‌మైన వ్య‌వ‌స్థలు మాత్రం ఆ గ‌డ్డు ప‌రిస్థితుల నుంచి గ‌ట్టెక్కుతాయ‌ని ఆయ‌న తెలిపారు.క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో.. ప్ర‌పంచ‌దేశాల ఆర్థిక స్థితి స‌రిగా లేద‌న్నారు. ఒక‌వేళ కోవిడ్‌19 కేసులు ఇలాగే పెరిగితే, అప్పుడు ప‌రిస్థితి ఆందోళ‌న‌కంగా ఉంటుంద‌న్నారు. స‌ప్లై చైయిన్ దెబ్బ‌తింటుంద‌ని, దాని వ‌ల్ల భార‌త వృద్ధి కుంటుప‌డుతుంద‌న్నారు.అయితే అంత‌ర్జాతీయంగా ఇంధ‌న ధ‌ర‌లు త‌గ్గ‌డం వ‌ల్ల ఇది మ‌న దేశానికి దోహ‌ద‌ప‌డే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు.ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆర్థిక మంద‌గ‌మ‌నం ఏర్పడినట్లు గుర్తించామ‌న్నారు. క‌రోనా వైర‌స్ లాక్‌డౌన్‌తో ఈ పరిస్థితి ఏర్ప‌డింద‌న్నారు. సోష‌ల్ డిస్టాన్సింగ్ లాంటి నియ‌మాల వ‌ల్ల కూడా ప‌రిస్థితి భ‌యాన‌కంగా ఉంద‌న్నారు.ఆర్థిక వ్య‌వ‌స్థ నెమ్మ‌దిగా కోలుకుంటుంద‌న్న ఆశ‌ల‌ను కూడా క‌రోనా దెబ్బ‌తీసింద‌న్నారు. బ‌్యాంకు రుణాల‌పై మూడు నెల‌ల మారిటోరియం విధిస్తున్న‌ట్లు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ తెలిపారు.ట‌ర్మ్ లోన్ల‌పై మూడు నెల‌ల పాటు ఇన్‌స్టాల్మెంట్స్ ఏమీ తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆర్బీఐ చెప్పింది. రెపో రేటును 75 బేసిస్ పాయింట్లు క‌ట్ చేస్తున్న‌ట్లు శ‌క్తికాంత్ దాస్ తెలిపారు. అన్ని బ్యాంకుల‌ క్యాష్ రిజ‌ర్వ్ రేషియోల‌ను కూడా త‌గ్గిస్తున్న‌ట్లు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ వెల్ల‌డించారు. వంద బేసిస్ పాయింట్ల నుంచి నెట్ డిమాండ్‌లో మూడు శాతానికి త‌గ్గించ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఈ నియ‌మం ఏడాది పాటు వ‌ర్తించ‌నున్న‌ది.దీని ద్వారా బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌లోకి 3.74 ల‌క్ష‌ల కోట్లు వ‌స్తాయ‌న్నారు.

* చైనాలో పుట్టిన నావెల్‌ కరోనా వైరస్‌ సోకితే ఏమైపోతామోనని చాలామంది భయపడుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని ప్రభుత్వం, వైద్యులు చెప్పినా ఆందోళన చెందుతున్నారు. అయితే సానుకూల దృక్పథంతో ఎదుర్కొంటే ఎలాంటి రోగమైనా తగ్గుతుందని పుణెకు చెందిన ఓ కుటుంబం నిరూపించింది. ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, యోగా చేయడం, చక్కని సంగీతం వినడం వల్ల కరోనా నుంచి త్వరగా కోలుకున్నామని వెల్లడించింది. మహారాష్ట్రలో కరోనా బారిన పడి కోలుకొని ఇంటికెళ్లిన తొలి కుటుంబం చెప్పిన వివరాలివీ.

* కేంద్రం ప్రకటించిన రూ.1.70 లక్షల కోట్ల ఉద్దీపన పథకం అండతో గురువారం లాభాల్లో ముగిసిన సెన్సెక్స్‌.. శుక్రవారం నష్టాలతో ముగిసింది. సామాన్యుడికి ఊరట కల్పిస్తూ ఆర్‌బీఐ ప్రకటించిన కొన్ని నిర్ణయాలు మదుపరులను మెప్పించలేకపోయాయి. రేట్ల కోత, మార్కెట్‌లోకి రూ.3.74 లక్షల కోట్లు చొప్పించేందుకు ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాలు వారిని మెప్పించినా.. కొవిడ్‌-19 కారణంగా వృద్ధి రేటు అంచనాలను తగ్గించడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో ట్రేడింగ్‌లో సుమారు 1700 పాయింట్ల లాభాల్లోకి వెళ్లిన సెన్సెక్స్‌ చివరికి నష్టాలతో ముగిసింది.

* ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్నప్పటికీ.. దేశీయ స్టాక్‌ మార్కెట్లు మాత్రం లాభాల్లో కొనసాగుతున్నాయి. శుక్రవారం సూచీలు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.45 గంటలకు సెన్సెక్స్‌ 1,039 పాయింట్లు లాభపడి 30,986 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 358 పాయింట్లు ఎగబాకి 8,999 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.30 వద్ద కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం కరోనా కట్టడి చర్యల నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు రూ.1.70లక్షల కోట్ల ఉద్దీపన పథకం ప్రకటించడం సూచీల సెంటిమెంటును పెంచింది. అలాగే మరికాసేపట్లో ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ మీడియా సమావేశానికి పిలుపునివ్వడమూ మదుపర్లపై సానుకూల ప్రభావం చూపింది. వడ్డీరేట్ల తగ్గింపుతో పాటు మార్కెట్లో ద్రవ్యలభ్యత పెంచడం కోసం ఆర్బీఐ మరిన్ని చర్యలు చేపట్టే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులకు చెక్‌ పెట్టే దిశగా జి-20 దేశాలు 5లక్షల కోట్ల ప్యాకేజీని ప్రతిపాదించడం కూడా సూచీలపై సానుకూల ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.

* పుణెలో కొవిడ్‌-19కు అడ్డుకట్టవేయడానికి కావలసిన కీలక ఆరోగ్య సంరక్షణ మౌలిక వసతులను అభివృద్ధి చేయడానికి రూ.100 కోట్లతో నిధిని ఏర్పాటు చేసినట్లు బజాజ్‌ గ్రూప్‌ తెలిపింది. అదే సమయంలో కార్మికులు, ఇల్లు లేనివారు, వీధి పిల్లలకు తక్షణం సహాయం చేయనున్నట్లు గ్రూప్‌ అధిపతి రాహుల్‌ బజాజ్‌ ప్రకటించారు.

* లాక్‌డౌన్‌ ఫలితంగా ఇళ్లలోనే ఉంటున్న వారు చదువుకునేందుకు వీలుగా తమ ఇ-బుక్‌ ప్లాట్‌ఫామ్‌ జగర్‌నాట్‌బుక్స్‌ (గతంలో ఎయిర్‌టెల్‌ బుక్స్‌)ను ఉచితంగా వినియోగించుకునే అవకాశాన్ని తమ చందాదార్లకు భారతీ ఎయిర్‌టెల్‌ కల్పించింది. వేల సంఖ్యలోని పుస్తకాలు, నవలలు ఉచితంగా చదువుకోవచ్చని సంస్థ పేర్కొంది. ఇందుకోసం ఆ యాప్‌ను తమ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుంటే సరిపోతుందని వివరించింది.