Health

బందరు మహిళకు…బ్రిటన్ ప్రధానికి కొరోనా పాజిటివ్-TNI Special Coverage

బందరు మహిళకు…బ్రిటన్ ప్రధానికి కొరోనా పాజిటివ్-TNI Special Coverage

* తనకు కరోనా పాజిటివ్ లక్షణాలు సోకినట్టు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. స్వల్పజ్వరం, దగ్గుతో బాధపడిన తాను టెస్ట్ చేయించుకున్నానని, ఈ టెస్టులో ఈ లక్షణాలు ఉన్నట్టు బయట పడిందని చెప్పిన ఆయన.. ఇక సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉంటానని పేర్కొన్నారు, అయితే వీడియోకాన్ఫరెన్స్ ద్వారా పాలన కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు. నిత్యం ఇతర సీనియర్ మంత్రులు, అధికారులతో బిజీగా, సన్నిహితంగా ఉండే బోరిస్ జాన్సన్ స్వయంగా ఈ ప్రకటన చేయడంతో వారందరిలోనూ ఆందోళన మొదలైంది. అటు ప్రస్తుతం గర్భిణిగా ఉన్న జాన్సన్ పార్ట్ నర్ క్యారీ సైమండ్స్ కి కూడా కరోనా సోకవచ్ఛుననే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే ప్రిన్స్ చార్లెస్ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అలాగే బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి నాడీన్ డోరిస్ కోలుకుని మళ్ళీ విధులకు హాజరవుతున్నారు. బ్రిటన్ లో కరోనా మృతుల సంఖ్య 578 కి పెరిగింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సైతం ఈ వ్యాధి బారిన పడినా కోలుకున్నారు.

* భారత్​లో గురువారం ఒక్కరోజే అత్యధికంగా 88 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.అయితే వైరస్ అంతర్గతంగా వ్యాప్తి జరుగుతున్నట్లు నిర్ధరించలేమని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.మిగతా దేశాలతో పోలిస్తే వైరస్ వ్యాప్తి రేటు తగ్గిందని పేర్కొంది.

* కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలోని కోర్టుల కార్యకలాపాలను నిలిపివేయాలని హైకోర్టు నిర్ణయించింది.ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ఫుల్‌ కోర్టు ఇటీవల కరోనా వ్యాప్తి నియంత్రణపై కూలంకషంగా చర్చించి ఈ నెల 31వ తేదీ వరకూ హైకోర్టుతోపాటు దిగువ న్యాయస్థానాలు, ట్రైబ్యునళ్లు, న్యాయసేవాధికార సంస్థ తదితరాల కార్యకలాపాలన్నింటినీ నిలిపివేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

* ఏపీలో 12 వ పాజిటివ్ కేసు నమోదుఇటీవలే బర్మింగ్ హమ్ నుంచి వచ్చి 7 వ పాజిటివ్ కేసుగా నమోదైన వ్యక్తి నుంచి 12 వ వ్యక్తికి వ్యాపించింది

* కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సమీపంలో బనవాసి జవహర్ నవోదయ స్కూల్ లో ఏర్పాటు చేసిన కోవిడ్-19 క్వారంటైన్ విధుల్లో తీవ్ర అలసత్వం, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆదోని డిప్యూటీ డిఎంహెచ్ఓ డా.రంగనాయక్ ను తక్షణమే సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ వీరపాండియన్ .

* అనంతపురం నుంచి ఫ్రాన్స్ కు వెళ్లి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటీవ్ నిర్దారణ అయినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు.అయితే ప్రస్తుతం ఆ వ్యక్తి బెంగళూరులో చికిత్స పొందుతున్నాడని ఆయన చెప్పారు.నగరానికి చెందిన ఓ వ్యక్తి మార్చి 1 నుంచి 18వ తేదీ వరకు ఫ్రాన్స్ ఉండి తిరిగి అనంతపురం జిల్లాకు వచ్చాడు.అనంతపురంలో కొన్ని రోజులుగా ఆ తరువాత పుట్టపర్తిలో రెండు వారాల పాటు ఓ లాడ్జిలో బస చేశాడు.ఆతరువాత బెంగళూరుకు వెళ్లగా అక్కడా పాజిటీవ్ గా నిర్దారణ అయింది.దీంతో అప్రమత్తమైన అధికారులు సదరు వ్యక్తి ఎక్కడెక్కడ తిరిగాడు, ఎవరెవర్ని కలిశాడు, తిరిగి వారందరూ ఎవరికి టచ్ లో ఉన్నారన్నది గుర్తిస్తున్నారు.అలాగే పుట్టపర్తి ఆ వ్యక్తి బస చేసిన లాడ్జిని ఇప్పటికే సీజ్ చేశారు.

* చికిత్స కోసం ఓ వ్యక్తి తన భార్యను 12 కిలోమీటర్ల దూరం సైకిల్‌పై తీసుకెళ్లాడు.అంబులెన్స్‌ను సహాయం కోరితే వారు ఎక్కువ మొత్తంలో డబ్బు డిమాండ్‌ చేశారు.చేసేదేమీ లేక తన భార్యను బ్రతికించుకోవడానికి.. ఆమెను సైకిల్‌పై తీసుకెళ్లాడు.ఈ సంఘటన పంజాబ్‌లోని లుధియానాలో చోటు చేసుకుంది.భరత్‌నగర్‌కు చెందిన ఓ మహిళ స్థానికంగా ఉన్న ఫ్యాక్టరీలో పని చేస్తుంది. మార్చి 20వ తేదీన ఫ్యాక్టరీలోనే ఆమె గాయపడింది.దీంతో ఫ్యాక్టరీ సిబ్బంది ఆమెను భరత్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.అయితే ఆమెకు ఎక్స్‌రే తీయగా.. ఊపిరితిత్తుల్లో నీరు భారీగా చేరినట్లు తేలింది.మెరుగైన చికిత్స కోసం కంగన్‌వాల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు.

* దేశంలో కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి.వైద్యులు, సిబ్బందిపై ఒత్తిడి అంతకంతకూ పెరుగుతోంది. వారి ప్రాణాలకూ ముప్పు ఏర్పడుతోంది.అయినా ఏమాత్రం భయపడకుండా, ప్రజాసేవే పరమావధిగా పనిచేస్తున్నారు వారంతా.రాజస్థాన్​ భిల్వారాలో ఇలాంటి ఓ బృందం తమతోపాటు దేశంలోని ఇతర వైద్యులు, సిబ్బందిలో నూతనోత్సాహం నింపే ప్రయత్నం చేసింది.’హమ్​ హందూస్థానీ’ పాట పాడింది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతుంది.

* కరోనా మహమ్మారిని కట్టడి చేయడంపై చర్చే ప్రధాన అజెండాగా అన్ని రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.కొవిడ్​-19తో ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు, నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.కరోనాపై పోరులో ఆయా రాష్ట్రాలలోని వైద్యవిభాగం చేస్తున్న సేవలను మెచ్చుకున్నారు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి.కష్టకాలంలోనూ ధైర్యంగా నిలబడిన వైద్యులపై కోవింద్​ ప్రశంసల జల్లు కురిపించారు.

* కరోనా వైరస్​పై పోరాడేందుకు మహారాష్ట్ర సీఎం సహాయనిధికి షిరిడీ సాయిబాబా సంస్థాన్​ ట్రస్ట్ రూ.51 కోట్లు విరాళం ఇచ్చింది.​

* క్షణక్షణానికి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు48 గంటల వ్యవధిలో 4 నుంచి 5 లక్షలకు చేరిన పాజిటివ్ కేసులుప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 5,32,224 కేసులు.ఇప్పటి వరకు 24వేలు దాటిన కరోనా మరణాల సంఖ్య1,24,326 మంది రికవరీ, 3.83 లక్షల యాక్టివ్ కేసులు.అమెరికాలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారికేసుల సంఖ్యలో చైనా, ఇటలీని అధిగమించిన అమెరికా85,594 కేసులతో అగ్రస్థానంలో అగ్రరాజ్యం81,340 కేసులతో 2వ స్థానంలో చైనా, 80,589 కేసులతో 3వ స్థానంలో ఇటలీఆ తర్వాతి స్థానాల్లో స్పెయిన్ (57,786), జెర్మనీ (43,938), ఇరాన్ (29,406), ఫ్రాన్స్ (29,155)కరోనా మరణాల సంఖ్యలో మొదటి స్థానంలో ఇటలీ (8,215), రెండో స్థానంలో స్పెయిన్ (4,365)ఆ తర్వాతి స్థానాల్లో చైనా, ఇరాన్, ఫ్రాన్స్, అమెరికాభారత్‌లోనూ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు.727కు చేరుకున్న కరోనా పాజిటివ్ కేసులు

* మచిలీపట్టణం ప్రభుత్వాసుపత్రి లో నర్స్ గా పనిచేస్తున్న ఓ మహిళ భర్త ఇటివల కువైట్ నుండి వచ్చి రాజోలు లో నిర్బందంలొ ఉండాల్సిన వ్యక్తి అక్కడినుండి తప్పించుకుని మచిలీపట్టణం వచ్చి ఇక్కడ జనావాసాల్లో తిరుగుతునట్టు గుర్తించిన వార్డు వాలంటీర్ .క్రిమినల్ కేసు నమోదుచేసి ఇంటివద్ద పికీటింగ్ ఏర్పాటు.నర్స్ పై యాక్షన్ తీసుకోవాలని ఉన్నతాధికారులకు పిర్యాదు .

* ఆంధ్ర – తెలంగాణ సరిహద్దులో పోలీసులు అప్రమత్తమయ్యారు.అడిషనల్ ఎస్పీ చక్కవర్తి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.గత రాత్రి ఘర్షణల నేపథ్యంలో బందోబస్తును పెంచారు.పొందుగుల బ్రిడ్జిపై ఇనుప కంచెలను ఏర్పాటు చేశారు.14 రోజుల క్వారైంటన్‌లో ఉండే వారికి ఏపీలోకి పోలీసులు అనుమతిస్తున్నారు.

* భారత్​లో గురువారం ఒక్కరోజే అత్యధికంగా 88 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.అయితే వైరస్ అంతర్గతంగా వ్యాప్తి జరుగుతున్నట్లు నిర్ధరించలేమని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.మిగతా దేశాలతో పోలిస్తే వైరస్ వ్యాప్తి రేటు తగ్గిందని పేర్కొంది.