అమెరికాను కొవిడ్-19 పెనుభూతం వణికిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 15వేలకు పైచిలుకు కేసులు నమోదు కాగా అమెరికావ్యాప్తంగా ఉన్న మొత్తం కేసులు సంఖ్య ఒక లక్షా 2వేల పైకి ఎగబాకింది. బుధవారం నాడు కొరోనా నిర్ధారిత బాధితుల సంఖ్యలో చైనాను దాటిన అమెరికా ఇప్పుడు తాజాగా లక్ష మైలురాయిని కూడా దాటేయడం బెంబేలెత్తిస్తోంది. కాగా ఈ లక్షమందిలో 45వేల మందికి కేవలం న్యూయార్క్‌లోనే ఉండటం విశేషం. అమెరికాలో ఇప్పటివరకు 1564 మంది ఈ మహమ్మారి వలన ప్రాణాలు కోల్పోగా ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే 519మంది అసువులుబాశారు.
Flash: లక్ష దాటిన అమెరికా కొరోనా కేసులు
Related tags :