Health

కొలెస్ట్రాల్ టాబ్లెట్లు వేసుకుంటున్నారా?

Cholesterol Tablets Could Be Dangerous

డయాబెటీస్.. ఈ తియ్యని జబ్బు ప్రతీఒక్కరికీ కామన్ అయిపోయింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ సమస్య దాడిచేస్తూనే ఉంది. ఎన్నో కారణాల వల్ల డయాబెటీస్ వస్తుంటుంది. ఆ కారణాల్లో ఇప్పుడు ఇంకొకటి వచ్చి చేరింది. అవే కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్స్..

* చాలామందికి కొలెస్ట్రాల్ సమస్య ఉంటుంది. శరీరంలో ఎక్కడికక్కడ పేరుకుపోయిన కొవ్వుని తగ్గించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అందులో ఒకటి ట్యాబ్లెట్స్ వేసుకోవడం. అవే స్టాటిన్స్ వీటిని తీసుకోవడం వల్ల కొవ్వు తగ్గుతుంది. కానీ తాజాగా తేలిన విషయమేంటంటే టైప్ 2 డయాబెటిస్ మధుమేహానికి గురవుతారని తేలింది. క్లినికల్ ఫార్మాలజీ బ్రిటిష్ జర్నల్‌ఏళ్ళు పైబడిన 9500మందిపై 15 సంవత్సరాలపాటు అధ్యయనం చేశారు. ఇందులో ఆసక్తికర నిజాలు తెలిసాయి.
* కొవ్వు స్థాయిని తగ్గించే మాత్రలు వాడని వారితో పోలిస్తే.. స్టాటిన్స్ తీసుకునేవారిలో టైప్ 2 మధుమేహం అభివృద్ధి చెందింది. ఇందుకు కారణమేంటంటే.. స్టాటిన్స్ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు, ఇన్సులిన్ నిరోధకత పెరుగుతాయట. అందువల్ల టైప్ 2 డయాబెటీస్ వస్తుందని చెబుతున్నారు.
* కాబట్టి ఇలాంటి ట్యాబ్లెట్స్‌కి దూరంగా ఉండి సహజ పద్ధతిలో ఒంట్లోని కొవ్వు శాతం తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.

Diabetes and Statins - What are Statins, Effect on Cholesterol