Movies

రాధికా ఆప్టేకు కొరోనా పరీక్ష?

Did Radhika Apte Undergo COVID19 Testing?

మ‌రాఠీ భామ రాధికా ఆప్టే సౌత్‌లో క‌న్నా బాలీవుడ్‌, హాలీవుడ్ చిత్రాల‌లో ఎక్కువ‌గా న‌టిస్తుంది. ఇటీవ‌ల ఇండియాకి వ‌చ్చిన రాధికా వెంటనే తిరిగి లండ‌న్ వెళ్లింది. ఆ స‌మ‌యంలో త‌న‌కి ఎదురైన అనుభ‌వాల‌ని ఇటీవ‌ల త‌న సోష‌ల్ మీడియా ద్వారా నెటిజ‌న్స్‌తో షేర్ చేసుకుంది. తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ముఖానికి మాస్క్ వేసుకొని ఉన్న ఫోటోని షేర్ చేస్తూ.. హాస్పిట‌ల్‌లో ఉన్నాన‌ని కామెంట్ పెట్టింది.

ఈ స‌మ‌యంలో రాధికా హాస్పిట‌ల్‌కి వెళ్లిందంటే క‌రోనా సోకిఉంటుందా అనే అనుమానాన్ని జ‌నాలు వ్య‌క్తం చేస్తార‌ని ముందే ఊహించిన ఈ అమ్మ‌డు కొన్ని హ్యాష్ ట్యాగ్స్ జ‌త చేసింది. బ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. అంతా మంచిగానే ఉంది. క్వారంటైన్‌లో ఉండి క్షేమంగా ఉండండి అని స్ప‌ష్టం చేసింది. రాధికా ఆప్టే పోస్ట్‌పై స్పందించిన గ‌ల్లీబాయ్ న‌టుడు విజ‌య్ వ‌ర్మ‌.. ఓమై గాడ్.. టేక్ కేర్ డియ‌ర్.. గాడ్ బ్లెస్ యూ అని కామెంట్ పెట్టాడు. అయితే రాధికా ఆప్టే ఈ స‌మ‌యంలో ఆసుపత్రికి పోవ‌ల‌సిన అవ‌స‌రం ఏమోచ్చింద‌ని అభిమానులు ముచ్చ‌టించుకుంటున్నారు.