* రైల్వే బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మార్చిన మోదీ ప్రభుత్వం.ఒక్క కోచ్ లో 9 మంది రోగులకు వసతులు కల్పించారు. ఇలాంటివి పదివేల కోచ్ లు సిద్దంచేయనున్న భారత ప్రభుత్వం.
* బ్రహ్మంగారిమఠం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములవారి ఆలయం గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండిస్తున్నాం…ఆలయంలోని పూజారి చనిపోయాడని వస్తున్న వార్తలు అవస్తావాలు…మిరియాలు, అల్లం, బెల్లం, కలిపి నీటిని త్రాగితే కరోనా వ్యాధిని నివారించవచ్చని బ్రహ్మంగారు చెప్పినట్లుగా సోషియల్ మీడియాలో వస్తున్న కథనాలు నిజం కావు…అటువంటి అవాస్తవాలను ప్రజలు నమ్మవద్దు..ఈ కథనాలు సోషల్ మీడియాలో ప్రచురించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం..సైబర్ నేరంకింద అతని పై కేసు నమోదుకు ఫిర్యాదు చేస్తాం…ఇదే విషయాన్ని రాష్ట్ర డిజిపి, కడప ఎస్పీ కి లేఖలు పంపుతున్నాం..దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తుల పై కఠిన చర్యలకు ఫిర్యాదు చేశాము.
* ఈటల రాజేందర్ మంత్రి తెలంగాణకొరొనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిందికుత్బుల్లాపూర్ ఏరియా నుంచి ఒకటే కుటుంబం నుంచి నాలుగు కేసులు నమోదుకొరొనా ఇప్పటి తెలంగాణ ప్రజలకు సోకలేదుకొరొనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాముఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి సమాచారం మాకు అందించాలి*సీఎం ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు. ఇవ్వాళ కొత్తగా 6 కేసులు కొత్తగా వచ్చాయితెలంగాణ లో తొలి కొరొనా మృతిసీరియస్ కండిషన్ లో గ్లోబల్ హాస్పిటల్ లో చేరారు…మరణించిన తరువాత తెలిసింది అతనికి కొరొనా వచ్చిందిఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికపుడు అందుబాటులో పెడుతాముఏ హాస్పిటల్ లో ఎలాంటి సమస్య లేదుకొరొనా పై తప్పుడు ప్రచారం చేయకండిఇప్పటి వరకు 65 కు కొరొనా కేసులు నమోదుకొరొనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిందికుత్బుల్లాపూర్ ఏరియా నుంచి ఒకటే కుటుంబం నుంచి నాలుగు కేసులు నమోదుకొరొనా ఇప్పటి తెలంగాణ ప్రజలకు సోకలేదుకొరొనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాముఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి సమాచారం మాకు అందించాలి*సీఎం ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు65 కొరొనా కేసుల్లో ఒకరు మృతి చెందారు* ఎంతమంది కొరొనా రోగులు ఉన్నా ట్రీట్మెంట్ అందిస్తాం.* కావాల్సిన యంత్రపరికారాలు అన్ని అందుబాటులో తెస్తున్నాము.* 6 రోజుల్లో గచ్చిబౌలి లో స్పోర్ట్స్ కాంప్లెక్ రెడి అవుతుంది.* గాంధీ వైద్యులకు వారి వారి ఏరియాల్లో ప్రజలెవ్వరు ఇబ్బంది పెట్టొద్దు.* అలాంటి వైద్యులకు అండగా ఉండాలి.* క్వరంటాయిన్ లో ఉన్న వారి సంఖ్య తగ్గుతుంది.* ఒక్క వ్యక్తికి వస్తే కుటుంబం అంతా వచ్చే ప్రమాదం ఉంది.* విదేశాల నుంచి వచ్చిన వారు బాధ్యతగా ఉండాలి.* సీఎం ఆదేశాలతో 24 గంటలు ఒన్ డ్యూటీ లో ఉంటున్నాము.* హైదరాబాద్ లో ఎక్కడ రెడ్ జోన్ లేదు.* ప్రార్థన మందిరాల్లోకి ప్రజాలేవరూ వెళ్ళకండి.* ఇవ్వాళ నమోదు అయిన కేసుల్లో మూడు కేసులు ఢిల్లీ ప్రార్థన మందిరాల్లోకి వెళ్లిన వారివే.* ఖైరతాబాద్ లోని 74 ఏళ్ల వృద్ధుడు కొరొనా తో మృతి.* వైద్యులు-ఎయిర్ పోర్ట్ లోని స్క్రినింగ్ లో పనిచేసే సిబ్బంది- వారి కుటుంబాలకు కొరొనా సోకింది.* రోగుల దగ్గర పనిచేసే సిబ్బంది-వ్యక్తులు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి.* వైద్య ఆరోగ్యశాఖలో పనిచేసే సిబ్బందికి షిఫ్ట్ లాగా విధులు నిర్వహించే లాగా ఏర్పాటు చేస్తాం.* వైద్యులకు అవసరం అయితే…10 రోజులు విధులు..మరో పది రోజులు లీవ్ ఇస్తాము.* క్వరంటాయిన్ లో 13వేల మంది ప్రస్తుతం ఉన్నారు.* రోజు రోజుకు క్వరంటాయిన్ లో సంఖ్య తగ్గుతుంది.* క్వరంటాయిన్ లో ఉన్న వారు 14 రోజులు క్వరంటాయిన్ లో ఉండాలి.* రాష్ట్రంలోని నాలుగు కుటుంబాల నుంచి కేసులు పెరిగాయి.65 కొరోగా పది మంది రోగులకు నెగిటివ్ వచ్చింది.
* కరోనా కట్టడి కోసం ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా బాధితులకు వైద్య చికిత్సలు అందిస్తున్న వైద్యులు, ఇతర పారామెడికల్ సిబ్బందిని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. మహారాష్ట్రలోని పుణెలో వైరస్ బాధితులకు చికిత్స అందిస్తున్న ఓ ఆస్పత్రిలో నర్సుకు ఫోన్ చేసిన ఆయన.. కరోనా నివారణకు ఆస్పత్రి సిబ్బంది చేస్తున్న కృషిని అభినందించారు. ఆస్పత్రిలోని ఛాయా అనే నర్సుకు ప్రధాని ఫోన్ చేసి అభినందించినట్టు పుణె మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. తొలుత ఆమెను మరాఠీలో పలకరించిన ప్రధాని.. ఛాయా కుటుంబం యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. చికిత్స అందించే సమయంలో వైరస్ నుంచి తన రక్షణపై కుటుంబ సభ్యులను ఎలా ఒప్పించగలిగారాంటూ ప్రశ్నించిన ఆయన.. రోగులకు అంకితభావంతో ఆమె చేస్తున్న సేవలను ప్రశంసించారు. ఈ ఫోన్ సంభాషణ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
* భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటివరకు దేశంలో 909 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయినట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ మహమ్మారి బారిన పడిన వారిలో 40 మంది కోలుకోగా.. 19 మంది మృత్యువాత పడినట్టు తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్రలో 180 కేసులు నమోదు కాగా.. కేరళలో 176; కర్ణాటకలో 55; తెలంగాణలో 56; ఏపీలో 14; దిల్లీలో 39; గుజరాత్‌లో 45; రాజస్థాన్‌లో 54; పంజాబ్‌లో 38; యూపీలో 54, తమిళనాడులో 40.. ఇలా దేశ వ్యాప్తంగా మొత్తం 27 రాష్ట్రాలు/కేంద్ర పాలితప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 909కి చేరినట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
* కరోనాపై పోరాడుతున్న ప్రభుత్వాలకు శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం తన వంతు సహకారం అందించింది. కరోనా నివారణ చర్యల నిమిత్తం మొత్తం రూ.4 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఏపీకి రూ.కోటి, తెలంగాణకు రూ.కోటితో పాటు తమిళనాడు, కర్ణాటకకు రూ.25లక్షల చొప్పున విరాళం ప్రకటించింది. అలాగే, ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.1.50 కోట్ల విరాళం ప్రకటించింది.