Politics

ప్రకాశ్ జవదేకర్‌కు ట్విట్టర్ సెగ

Prakash Javadekar Faces Netizen Anger Over Ramayana

మంత్రి పదవి అంటే మాటలా.. ప్రజలకు నచ్చేది చేయాలి.. పూలు పడతాయి.. లేకపోతే రాళ్లు పడతాయి. కానీ ప్రజలకు ఏది నచ్చుతుందో ఏది నచ్చదో చెప్పడమే చాలాచాలా కష్టం. కేంద్ర సమాచార ప్రసార శాఖామంత్రి మంత్రి ప్రకాశ్ జావడేకర్ ఈ విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో దూరదర్శన్ రామాయణ్ సీరియల్‌ను తిరిగి ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సీరియల్‌కు చాలామంది అభిమానులున్నారు. తన లివింగ్‌రూంలో హాయిగా సోఫాలో జారగిలబడి రామాయణ్ చూస్తూ మంత్రి ఓ ఫొటో తీసుకున్నారు. జనం మెచ్చుకుంటారని దానిని ట్విట్టర్ లో పెట్టుకున్నారు. కానీ తానొకటి తలిస్తే జనం ఒకటి తలిచారు. ఉన్నపళంగా లాక్ డౌన్ ప్రకటించడంతో జనజీవితం అతలాకుతలమైంది. ప్రయాణానికి వాహనాలు లేక, ఉన్నఊరికి వెళ్లలేక కోట్లమంది రోడ్ల మీద ఇబ్బందులు పడుతున్నారు. మంత్రి ఇలా హాయిగా ఇంట్లో కాలుమీద కాలు వేసుకుని సీరియల్స్ చూడడమా అని ట్విట్టర్‌లో నెటిజన్లు భగ్గుమన్నారు. బాగానే ఉంది మీ సోకు అంటూ అక్షింతలు వేశారు. దీంతో మంత్రి నాలిక కరుచుకుని రామాయణ్ ఫొటోను తొలగించేశారు.