కరోనా వైరస్ కారణంగా టోక్యో ఒలింపిక్స్ ఏడాది వాయిదా వేయడాన్ని భారత స్టార్ షట్లర్, ప్రపంచ చాంపియన్ పీవీ సింధు పూర్తిగా సమర్థించింది. ఒలింపిక్స్‌లో పోటీ పడడం అథ్లెట్లందరికీ కల అని, అయితే జీవితమే అన్నికంటే ప్రథమమని శనివారం ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది. ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొని స్వదేశానికి వచ్చినప్పటి నుంచి సింధు స్వీయ నిర్బంధంలో ఉంది. “ఒలింపిక్స్‌ను వాయిదా వేయడం మంచి నిర్ణయం. ఎందుకంటే మరో అవకాశం లేదు. కరోనా వల్ల కొందరు ప్రజలు చనిపోతున్నారు. జీవితమే ప్రథమం. టోర్నీలను సైతం రద్దు చేస్తుండడం మంచి విషయం. ప్రతి వారం, ప్రతి రోజు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్నది. ఒలింపిక్స్ వాయిదా పడ్డాయని నాకు కొందరు నిరాశగా చెబుతున్నారు. అయితే జీవితమే తొలి ప్రాధాన్యం.. ఆ తర్వాతే ఒలింపిక్స్’ అని తెలుగమ్మాయి సింధు తెలిపింది. అలాగే తాను 12రోజుల తన గది నుంచి బయటకు రాలేదని సింధు చెప్పింది.
సింధు…సూక్తులకు ఏమి కొదవ లేదు!
Related tags :