తెలంగాణలో మహమ్మారి కరోనా వైరస్‌పై పోరాటం కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పక్కాగా అమలు చేస్తూ వైరస్‌ను నివారించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే వైరస్ సోకిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో 11 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. వీరందరికీ గతంలో పాజిటివ్ అని తేలగా.. తాజా నమూనాల్లో నెగటివ్ రిపోర్టు వచ్చింది. ఈ మేరకు ట్విటర్లో ఆయన పోస్టు చేశారు. ఇటీవల వీరందరికీ ఐసోలేషన్ వార్డులో చికిత్స అందించారు.
తెలంగాణాలో బానే కోలుకున్న కొరోనా రోగులు
Related tags :