ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ నాట్స్ ఆధ్వర్యంలో కొరోనావైరస్‌పై వెబినార్ నిర్వహించారు. కరోనా బారిన పడకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై ప్రముఖ వైద్య నిపుణులు కె.వి. సుందరేశ్, డాక్టర్ మధు కొర్రపాటిలు ప్రసంగించారు. కొరోనా బాధితుల్లో లక్షణాలు, మరనానికి గల కారణాలను విశ్లేషించారు. అమెరికాలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో 10లక్షలు మంది ఈ మహమ్మారి బారిన పడే అవకాశం ఉందని వారు అన్నారు. శ్వాసకోశ సమస్యలు కలిగినవారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బయటకు వెళ్లి వచ్చాక చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కోవాలని కోరారు. న్యూయార్క్‌కు చెందిన కోవిడ్ బారిన పడిన ఓ ప్రవాసాంధ్రుడు తాను తీసుకున్న జాగ్రత్తలను ఈ వెబినార్‌లో సభికులతో పంచుకున్నారు. నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డ్ కార్యదర్శి ప్రశాంత్ పిన్నమనేని, సలహాకమిటీ ఛైర్మన్ శ్రీనివాస్ మల్లాది, డా. దుర్గారావు పరిమి, టెంపా నాట్స్ కో ఆర్డినేటర్ రాజేశ్ కాండ్రు, సెక్రటరీ సుధీర్ మిక్కిలినేని, సుబ్బారావు యన్నమని, నాట్స్ గ్లోబల్ టీం నుంచి విష్ణు వీరపనేని ఈ వెబినార్ నిర్వహణకు సహకరించారు. నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని, అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి ఫ్లోరిడా విభాగాన్ని అభినందించారు.
అమెరికాలో ప్రవాసాంధ్రుడికి కోరోనా
Related tags :