కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు కేంద్రం ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. కరోనా దెబ్బకు రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలకు తనవంతు సాయమందించేందుకు మహారాష్ట్రకు చెందిన రైతు ముందుకొచ్చాడు.
నాసిక్ కు చెందిన దత్త రామ్ పాటిల్ అనే రైతు తన 3 ఎకరాల గోధుమ పంటలో..1 ఎకరాన్ని ప్రజల కోసం దానం చేయాలని నిర్ణయించుకున్నాడు. పేద ప్రజలకు ఒక్కొక్కరి కి కొంత మొత్తంలో గోధుమలను పంపిణీ చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. మేం ఆర్థికంగా స్థిరంగా లేము. కానీ మా దగ్గర ఒక చపాతి ఉంటే..తినడానికి తిండి లేనివారికి చపాతిలో సగం వారికిచ్చేందుకు సిద్ధంగా ఉంటామని పాటిల్ భార్య చెప్పింది.