వచ్చే ఏడాది నిర్వహించే టోక్యో ఒలింపిక్స్ షెడ్యూల్‌పై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్టు జపాన్ మీడియా వెల్లడించింది. 2021 జూలై 23 నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు ఒలింపిక్స్ నిర్వహించాలని ఐవోసీ నిర్ణయించినట్టు జపాన్ బ్రాడ్‌కాస్టర్ ఎన్‌హెచ్‌కే ఆదివారం తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు జరగాల్సి ఉండగా.. కరోనా వైరస్ విజృంభణతో విశ్వక్రీడలను ఐవోసీ ఏడాది పాటు వాయిదా వేసింది. తొలుత ఒలింపిక్స్‌ను నిర్వహిస్తామని చెప్పిన ఐవోసీ.. సభ్యదేశాలు, క్రీడా సమాఖ్యలు, అథ్లెట్ల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో వెనక్కితగ్గి వచ్చే ఏడాది నిర్వహించనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. 2021లో ఒలింపిక్స్ జరిగినా పేరు మాత్రం టోక్యో 2020గానే ఉండనుంది.
2021 జులై 23న ఒలంపిక్స్
Related tags :