* క్షేత్రస్థాయిలో 55 సంవత్సరాలు పైబడిన పోలీస్ సిబ్బంది మరియు హృ దయ, శ్వాస, మధుమేహం సమస్యలతో క్షేత్రస్థాయి విధులకు దూరంగా ఉంచాలని ఆదేశాలు. వారందరికీ పోలీస్ స్టేషన్,ఆఫీస్,కంట్రోల్ రూం లలో మాత్రమే విధులు కేటాయించాలని అన్ని జిల్లాల అధికారులకు ఆదేశం.
* విజయవాడ కృష్ణలంకలో కరోనా పాజిటివ్ నమోదు కావడంతో ఈ నెల 30వ తేది సోమవారం 16, 17, 18, 20, 21,22 డివిజన్లలో పూర్తిగా లాక్ డౌన్, ప్రజలెవ్వరు బయటకు రావద్దని జిల్లా కలెక్టర్ ఏ. ఎండీ. ఇంతియాజ్ విజ్ఞప్తి చేసారు.
* కరోనా పై హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డిరాష్ట్రంలో 21కి చేరిన కరోనా పొజిటివ్ కేసులువిశాఖలో మరో 2 కేసులు పాజిటివ్ గా నిర్ధారణబర్మింగ్ హమ్ నుండి వచ్చిన కరోనా పొజిటివ్ వ్యక్తి తో కాంటాక్ట్ అయిన ఇద్దరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణఈరోజు 85 మంది కి కరోనా పరీక్షలు జరిపిన వైద్యులు83 మందికి కరోనా నెగటివ్ గా నిర్ధారణ, 2 పాజిటివ్.
Ø భారత్ లో ఇప్పటి వరకూ 1000 మందికి పైగా కరోనా వైరస్ సోకింది. వీరిలో 28 మంది మృతి చెందారు
Ø మధ్య ప్రదేశ్ లో విధులు నిర్వహిస్తున్న ఒక ‘బీ ఎస్ ఎఫ్’ అధికారికి కరోనా వైరస్ సోకింది
Ø దేశంలో లాక్ డౌన్ విధించినందుకు ప్రజలు తన పై కోపంగా ఉన్నారని, తనను క్షమించాలని, తప్పనిసరి పరిస్థితులలో లాక్ డౌన్ విధించవలసి వచ్చిందని ప్రధాని మోడీ ప్రకటించారు
Ø రేపటి నుండి లాక్ డౌన్ నిబంధనలు కఠిన తరం చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. నిబంధనలు అతిక్రమించిన వారిని 14 రోజులు క్వారంటైన్ కు తరలించాలని జిల్లా కలక్టర్లకు ఆదేశాలు అందాయి
Ø కేరళలో కరోనా కేసుల సంఖ్య 200 దాటాయి
Ø మాజీ క్రికెటర్ జోగీందర్ శర్మ లాక్ డౌన్ సమయంలో పోలీస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు
Ø స్పెయిన్ దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు గంట గంటకు పెరుగుతున్నాయి
Ø తెలంగాణాలో రేపటి నుండి రైతులు ధాన్యం అమ్ముకోడానికి గుర్తింపు కార్డులు అందచేయనున్నారు
Ø ప్రముఖ సినీ నటుడు నితిన్ ఏప్రిల్ 16 న జరగవలిసిన తన వివాహాన్ని వాయిదా వేసుకున్నట్లు ప్రకటించారు
Ø జర్మనీ దేశంలోని హెస్సీ రాష్ట్రం ఆర్ధిక మంత్రి థామస్ శాఫర్ కరోనా మూలంగా ఏర్పడిన ఆర్ధిక సంక్షోభానికి భాద్యత వహిస్తూ ఆత్మాహత్య చెసుకున్నారు
Ø ఏపీలో కరోనా కేసుల సంఖ్య 21కి పెరిగింది