కరోనా ప్రభావంతో షూటింగ్‌లకు బ్రేక్ పడటంతో ఈ విరామ సమయాన్ని మనసుకు నచ్చిన సినిమాలు చూస్తూ పరిపూర్ణంగా సద్వినియోగం చేసుకుంటున్నాని చెప్పింది చెన్నై సొగసరి రెజీనా. ఆమె మాట్లాడుతూ ‘కొన్ని సినిమాలు, సిరీస్‌లను చూడమని కొద్దిరోజుల క్రితం నా స్నేహితులు సూచించారు. ఇన్నాళ్లు షూటింగ్‌లతో బిజీగా ఉండటంతో వాటిని చూడలేకపోయాను. ఇప్పుడవన్నీ పూర్తిచేసే పనిలో ఉన్నాను. ఉదయం ఆరున్నరకు నిద్రలేవడంతో నా దినచర్య ప్రారంభమవుతుంది. మా ఇంటి బాల్కనీ తూర్పు దిశలో ఉంటుంది. కానీ నాకు ఏనాడు సూర్యోదయాన్ని చూసే వీలు చిక్కలేదు. ప్రస్తుతం తీరిగ్గా సమయాన్ని గడిపే రోజు ఉండటంతో బాల్కనీలో నుంచి సూర్యోదయంలోని అందాన్ని ఆస్వాదిస్తున్నా. పక్షుల కిలకిలరావాలతో పరవశించిపోతున్నా. ఇంటిచుట్టూ ఇన్ని అందాలున్నాయనే విషయం ఇప్పుడే తెలిసింది’ అని చెప్పుకొచ్చింది.
సూర్యుడితో స్నేహం
Related tags :