నగరంలోని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులార్ బయాలాజీ (సీసీఎంబీ)ని కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే ప్రయోగశాలగా ఉపయోగించాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతినిచ్చింది. దీంతో రేపటి నుంచి అక్కడ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సీసీఎంబీని ప్రస్తుతం జీవసంబంధ పరిశోధనల కోసం ఉపయోగిస్తున్నారని, ఇక్కడ కరోనా నిర్ధారణ పరీక్షలకు అనుమతిస్తే ఒకేసారి 1,000 నమూనాలను పరీక్షించే అవకాశం కలుగుతుందని ఇటీవల వీడియోకాన్ఫరెన్స్‌లో కేసీఆర్ ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సమాలోచనలు చేసిన కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది.
CCMBలో కొరోనా పరీక్షలు
Related tags :