Business

₹43800 వద్ద బంగారం

Gold Price At 43800 INR-Telugu Business News

స్టాక్‌మార్కెట్లు కుప్పకూలడంతో సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గుచూపడంతో హాట్‌ మెటల్‌ ధరలు భారమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి బారిన పడిన కేసులు పెరుగుతుండటం, ఆర్థిక మాంద్యం భయాలతో మదుపుదారులు బంగారంలో పెట్టుబడులకు మళ్లారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడికి డిమాండ్‌ పెరగడంతో దేశీ మార్కెట్‌లోనూ సోమవారం బంగారం ధరలు భగ్గుమన్నాయి. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ 229 ఎగిసి రూ 43,800 పలికింది. ఇక వెండి కిలో రూ 1059 తగ్గి రూ 39,835కు దిగివచ్చింది.

Today gold Price in India | 30-03-2020 | - YouTube