కరోనా వైరస్ వల్ల శ్రుతిహాసన్‌కి కొత్త చిక్కొచ్చింది. ఆమెని తన సినిమాలోలాగా ఒక సాహసం చేయమని వేడుకుంటున్నారట అభిమానులు. ఇంతకీ ఆ సాహసమేంటో తెలుసా? ఆమె కథానాయికగా నటించిన ‘సెవెన్త్ సెన్స్’ సినిమాలో కరోనా వైరస్ తరహాలోనే చైనా వల్ల ఒక వైరస్ ముప్పు ఏర్పడుతుంది. ఆ వైరస్ నుంచి మనకు విముక్తి కలగాలంటే బోధిధర్మ రావడమే మార్గం అనే విషయం జన్యు పరిశోధకురాలైన శ్రుతిహాసన్ తెలుసుకుంటుంది. వందేళ్ల కిందటి బోధిధర్మని కథలోకి తీసుకొస్తుంది. దాంతో సమస్య పరిష్కారమవుతుంది. ఇప్పుడు కరోనాతో సమస్యల్లో ఉన్నాం కాబట్టి… ఆ సినిమాలోలాగా బోధిధర్మని పిలవండంటూ శ్రుతిని పదే పదే అడుగుతున్నారట అభిమానులు. ఆ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా చెప్పింది.
శృతికి కొత్త చిక్కులు
Related tags :