* అమర రాజా గ్రూప్స్ చైర్మన్ డాక్టర్ రామచంద్ర ఎన్ గల్లా కోవిడ్ 19 నేపథ్యంలో??ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం నకు రూ.5 కోట్లు,??ఎం పి ల్యాడ్స్ నుండి గుంటూరు పార్లమెంట్ సభ్యులు జయదేవ్ గల్లా గుంటూరు పార్లమెంట్ లోని కోవిడ్ నియంత్రణ సేవలకు 2.5 కోట్లు .??తెలంగాణ ప్రభుత్వం నకు రూ.1 కోటి విరాళంగా ప్రకటించారు.ఇందుకు సంబంధించిన చెక్కులను అమర రాజా గ్రూప్ చైర్మన్ డా.రామచంద్ర ఎన్ గల్లా,వారి కుమార్తె డాక్టర్ రమాదేవి గారు జిల్లా కలెక్టర్ డా.నారాయణ భరత్ గుప్తా గారికి సోమవారం ఉదయం కలెక్టర్ ఛాంబర్ నందు అందజేశారు….?? గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి 50 లీటర్ల శానిటైజర్ లిక్విడ్ మరియు ణ్95 మాస్కులు అందజేశారు.
* భారతదేశపు వాణిజ్య బ్యాంకులలో ఆంధ్రాబ్యాంక్ ఒకటి. ఈ బ్యాంకును 1923, నవంబరు 20 న ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, మేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన భోగరాజు పట్టాభి సీతారామయ్య మచిలీపట్నంలో స్థాపించారు… 1980లో ఈ బ్యాంకుని జాతీయం చేశారు. 1981లో క్రెడిట్ కార్డు లను జారీ చేయుటం ద్వారా భారత దేశానికి క్రెడిట్ కార్డు వ్యవస్థను ఈ బ్యాంకు పరిచయం చేసింది… 2003 నాటికి నూరు శాతం కంప్యూటరీకరణ సాధించింది.. 2007లో బయోమెట్రిక్ ఏటిఎంలను భారతదేశానికి పరిచయం చేసింది.2007 సెప్టెంబర్ నాటికి ఈ బ్యాంకు 1,289 (గ్రామీణ-396, సెమీ అర్బన్ -376, పట్టణ- 338, మెట్రో-179) బ్రాంచీలతో 99 ఎక్స్‌టెన్షన్ శాఖలతో, 37 శాటిలైట్ ఆఫీసులతో, 505 ఏటిఎంలతో, 22 రాష్ట్రాలలో, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలో విస్తరించి ఉంది. పెట్టుబడులను రాబట్టటంలో ఈ బ్యాంకు ఆసియాలోనే ప్రథమ స్థానంలో ఉంది.. భారతదేశం మొత్తంలో ఈ బ్యాంకుకు 1,30,000 షేర్‌హోల్డర్స్, 1.372 కోట్ల ఖాతాదారులు ఉన్నారు. ప్రారంభం నుండి నేటి వరకు మొత్తం ఋణాలలో కనీసం 50 శాతానికి తగ్గకుండా ఋణాలను గ్రామీణ భారతానికే అందిస్తున్న బ్యాంక్ ఆంధ్రాబ్యాంక్. దేశంలో బ్యాంకుల జాతీయం చేసిన తర్వాత క్రమబద్దంగా నడుస్తున్న జాతీయ బ్యాంకులలో ఇది ప్రధానమైనది.. అంతటి ప్రాధాన్యత కలిగన బ్యాంక్ నేడు కనుమరుగు కానున్నది..ఆంధ్రాబ్యాంక్ తెలుగుప్రజలకు అత్యంత సుపరిచితం. లోగో సైతం అందరిని విశేషంగా ఆకట్టుకుంది. ఆంధ్రాబ్యాంకు లోగోలో పెద్ద ఇన్ఫినిటీ (అనంతం) చిహ్నం ఉంటుంది. అది వినియోగదారుల కోసం ఏ పని చేయడానికైనా, ఎంత దూరం వెళ్ళటానికైనా సిద్ధం అనే సందేశాన్ని సూచిస్తుంది. గొలుసు మాదిరిగా కనిపించే తమ లోగో ఐక్యతను సూచిస్తుందని, ఎరుపు.. నీలం రంగులు చైతన్యాన్ని, దృఢత్వాన్ని సూచిస్తాయని ఆంధ్రాబ్యాంకు తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఇప్పుడు ఈ బ్యాంకు కనుమరుగు కానుండటంతో ఇక జాతీయ బ్యాంకు అనేది తెలుగు ప్రజలకు లేకుండా పోయింది..బ్యాంకుల విలీనానికి ఆర్‌బీఐ ఆమోదం తెలిపింది.. దీంతో ఏప్రిల్ 1 నుంచి తగ్గనున్న బ్యాంకుల సంఖ్య.. ఆ ఆరు బ్యాంకులు ఇక లేనట్లే.. ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటివి పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విలీనం అవుతాయి.. సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంక్‌లో కలిసిపోతుంది.. ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం అవుతాయి… ఇక చివరిగా అలహాబాద్ బ్యాంక్ కూడా ఇండియన్ బ్యాంక్‌లో కలిసిపోతుంది…ఏప్రిల్ 1 నుంచి విలీనమైన బ్యాంకుల బ్రాంచీలు అన్నీ మెయిన్ బ్యాంక్ బ్రాంచ్ లుగా మారిపోతాయి.. అంటే ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ బ్రాంచీలు పీఎన్‌బీ బ్రాంచ్ లుగా పనిచేస్తాయి. సిండికేట్ బ్యాంక్ బ్రాంచ్ లు కెనరా బ్యాంక్ బ్రాంచ్ లుగా మారతాయి. ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ బ్రాంచులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లుగా రూపాంతరం చెందుతాయి. అలాగే అలహాబాద్ బ్యాంక్ బ్రాంచ్ లు ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్ లుగా పనిచేస్తాయి..విలీనం తర్వాత దేశంలో ప్రభుత్వ రంగానికి సంబంధించి 7 పెద్ద బ్యాంకులు, 5 చిన్న బ్యాంకులు మాత్రమే మిగులుతాయి. 2017లో దాదాపు 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండేవి.. విలీనం తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెండో అతిపెద్ద బ్యాంక్‌గా అవతరిస్తుంది. ఎస్‌బీఐ అతిపెద్ద బ్యాంక్‌గా కొనసాగుతోంది… ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) మూడో అతిపెద్ద బ్యాంక్ అవుతుంది… దీని తర్వాతి స్థానంలో కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్ లు ఉంటాయి.. ఇక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ అనేవి ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు గా ఉంటాయి..
* వంటగ్యాస్, పెట్రోల్ వంటి ఇంధనాలకు కొరతే లేదని, లాక్‌డౌన్ నుంచి కనీసం 40 శాతం అదనంగా సరఫరా చేస్తున్నామని ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలు ఆదివారం ప్రకటించాయి. దేశంలో లాక్‌డౌన్ విధించాక, వంటగ్యాస్ సిలెండర్ల బుకింగ్ పెరిగిందని, అందుకు తగ్గట్లే రోజువారీ సగటు సరఫరా 35-40 శాతం పెరిగిందని, తక్కువ సిబ్బందితోనే ఇంత అందిస్తున్నామని కంపెనీలు తెలిపాయి. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా లాక్‌డౌన్ ప్రకటించినందున, వంటగ్యాస్‌కు కొరత వస్తుందనే ఆందోళనతో ప్రజలు అధికంగా సిలెండర్లు బుక్ చేస్తున్న నేపథ్యంలో ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ఈ భరోసా ఇచ్చాయి. సిబ్బంది కొరత వల్ల లాక్‌డౌన్ ప్రకటించిన మొదట్లో కాస్త ఇబ్బంది ఎదురైందని, ఇప్పుడు పరిస్థితి సజావుగా ఉందని తెలిపాయి.
* కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో, సేవా కేంద్రాలు (సర్వీస్ సెంటర్లు) మూసివేసిన నేపథ్యంలో, తమ కొనుగోలుదార్ల సందేహాలకు సామాజిక మాధ్యమాలు, ఇతర ఆన్‌లైన్ సాధనాల ద్వారా కంపెనీలు పరిష్కారాలు చూపేందుకు ప్రయత్నిస్తున్నాయి. సోనీ, శామ్‌సంగ్, పానసోనిక్, హైయర్, గోద్రేజ్ అప్లయన్సెస్ వంటి కంపెనీలు వైవ్‌ఛాట్, వాట్సాప్, డీఐవై వీడియో వంటి మాధ్యమాలతో పాటు ఆన్ కాల్ అసిస్టెన్స్ ద్వారా మారుమూల ప్రాంతాల్లోని ఖాతాదార్లతో సంభాషిస్తున్నాయి. ‘వాట్సాప్ వీడియోకాల్స్ ద్వారా సమస్య తెలుసుకుంటున్నాం. వీడియోలు చూపడం ద్వారా, కొన్ని సమస్యలను పరిష్కరించగలుగుతున్నాం. చిన్న, చిన్న మార్పులు ఏమైనా చేయాలంటే, వినియోగదారులే చేసుకునేలా విశదీకరిస్తున్నాం’ అని గోద్రేజ్ అప్లయన్సెస్ వ్యాపారాధిపతి కమన్ నంది తెలిపారు. ఏసీలను సొంతగా శుభ్రం చేసుకునేలా వీడియోలు సిద్ధం చేశమని పానసోనిక్ ఇండియా ప్రతినిధి వెల్లడించారు. సోనీ ఇండియా కాల్ సెంటరు కూడా మూసివేసినందున, ఐవీఆర్ మెసేజ్ ద్వారా, సంబంధిత వెబ్ పేజీకి చేరేలా వినియోగదారులకు సూచనలు చేస్తోంది. అందులోంచి లైవ్‌ఛాట్ ద్వారా సంస్థ ప్రతినిధి వినియోగదారులకు సహకరిస్తున్నారని సోనీ ఇండియా ప్రతినిధి తెలిపారు. శామ్‌సంగ్ కూడా లైవ్‌ఛాట్ ద్వారానే సందేహాలు తెలపాలని వినియోగదారులను కోరింది. హైయర్ అయితే వాట్సాప్, లైవ్‌ఛాట్, కేర్‌లైన్ ద్వారా కూడా సందేహాలు తీరుస్తోంది. హైయర్ సంస్థ అయితే అన్ని ఉత్పత్తుల పైనా వారెంటీని లాక్‌డౌన్ తొలగించాక, 2 నెలల వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది.