కొత్తగా ఐదు కేసుల నమోదుతో గుంటూరు జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. పెరిగిన కేసులతో జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9కి చేరింది. గుంటూరులో 2, మాచర్లలో 2, కారంపూడిలో ఒక కేసు చొప్పున కొత్తగా నమోదయ్యాయి. జిల్లా నుంచి 184 మంది దిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. 145 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. వారిలో ఐదుగురుకి పాజిటివ్గా గుర్తించారు. మిగిలిన 39 మంది ఆచూకీ కోసం అధికారులు, పోలీసులు గాలిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, లాక్ డౌన్, సామాజిక దూరం పాటించడం ద్వారా ప్రజలు సహకరించాలని గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ పిలుపునిచ్చారు. గుంటూరు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దిల్లీలో ప్రార్థనలకు వెళ్లిన 39 మంది ఆచూకీ కోసం ఆరా తీస్తున్నామని, ఈ కుటుంబాలు వారు స్వయంగా వచ్చి పరీక్షలు చేయించుకోవాలని కోరారు. గతంలో నెగెటివ్ వచ్చిన 18 మంది సైతం 28 రోజులు క్వారంటైన్ పాటించాల్సిందేనని.. బయటకు రావద్దని ఆదేశించారు.
గుంటూరులో 39మంది ఎటు పోయారో
Related tags :