ScienceAndTech

మీ వైఫై వేగం పెంచుకోండి

How to increase your Wi-Fi Speed during WFH in Telugu

Work From Home: ఈ 9 టిప్స్‌తో మీ వైఫై స్పీడ్ పెంచుకోండి

Work From Home | మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? మీ ఇంటర్నెట్ సరిగ్గా పనిచేయట్లేదా? వైఫై స్పీడ్‌గా ఉండట్లేదా? మీ వైఫై స్పీడ్ పెంచడానికి ఏం చేయాలో తెలుసుకోండి

1. ముందుగా వైఫై అవసరం లేని డివైజ్‌లు ఏవైనా ఉంటే మీ రౌటర్ నుంచి డిస్‌కనెక్ట్ చేయండి. స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్, స్మార్ట్‌టీవీ, ల్యాప్‌టాప్, కంప్యూటర్ ఇలా మీరు దేనికి వైఫై ఉపయోగించకపోతే ఆ డివైజ్‌ను డిస్‌కనెక్ట్ చేయాలి.

2. మీ రౌటర్ ఎక్కడ పెట్టారు అన్నది కూడా ముఖ్యమే. ఎలక్ట్రికల్ పరికరాలకు, గోడలకు కాస్త దూరంగా వైఫై ఏర్పాటు చేయండి. వైఫై సిగ్నల్స్‌ని గోడలు అడ్డుకునే అవకాశముంది. రౌటర్ చుట్టూ కాస్త స్పేస్ ఉండేలా ఏర్పాటు చేయండి. రిఫ్రిజిరేటర్ల లాంటి అప్లయెన్సెస్‌కు దూరంగా రౌటర్ ఉండాలి.

3. వేర్వేరు ఎస్ఎస్ఐడీలను క్రియేట్ చేయండి. ఏ డివైజ్‌కు ఎంత స్పీడ్, డేటా కేటాయించాలో అంతే సెట్ చేయండి. మీరు పనిచేసే డివైజ్‌లకు కాస్త ఎక్కువ స్పీడ్, డేటా అవసరం. దీని వల్ల మీ వర్క్‌కు ఇబ్బంది లేకుండా ఉంటుంది.

4. మీ వర్క్ డివైజ్‌కు ఫ్రీక్వెన్సీ వేరుగా ఉంచండి. ఆ ఫ్రీక్వెన్సీకి ఇతర డివైజ్‌లను కనెక్ట్ చేయొద్దు. ఉదాహరణకు డ్యూయెల్ బ్యాండ్ రౌటర్ ఉంటే వేర్వేరు ఫ్రీక్వెన్సీలు ఉంటాయి. అందులో ఒక ఫ్రీక్వెన్సీ మీ వర్క్ డివైజ్‌కు కేటాయించాలి.

5. మీరు రౌటర్‌కు దగ్గర పనిచేస్తున్నట్టైతే లాన్ కేబుల్‌ ఉపయోగించాలి. వైర్‌లెస్ కనెక్షన్ కన్నా, ల్యాన్ కేబుల్ ద్వారా ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కువ.

6. మీ డ్యుయెల్ బ్యాండ్ రౌటర్‌లో 2.4GHz కన్నా 5GHz ఫ్రీక్వెన్సీని ఉపయోగించండి. 5GHz ఫ్రీక్వెన్సీతో ఎక్కువ స్పీడ్‌ ఉంటుంది.

7. ఒకవేళ మీ వర్క్ డివైజ్‌కు రౌటర్‌కు మధ్య 10 అడుగుల దూరం ఉంటే 2.4GHz ఫ్రీక్వెన్సీ ఎంచుకోండి. దీని వల్ల సిగ్నల్ స్ట్రెంత్ బాగుంటుంది.

8. వైఫై డెడ్ జోన్స్ తెలుసుకునేందుకు థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించొచ్చు. ఎందుకంటే ప్రతీ రౌటర్‌కు లిమిటేషన్ ఉంటుంది. ఎన్ని యాంటెన్నాలు ఉన్నా డెడ్ జోన్స్ ఉంటాయి.

9. వైఫై కవరేజీని పెంచేందుకు రిపీటర్స్, ఎక్స్‌టెండర్స్ ఉపయోగించొచ్చు. మీ ఇంట్లో ఎక్కువ డెడ్‌జోన్స్ ఉన్నట్టైతే ఇవి ఉపయోగపడతాయి.