మహారాష్ట్ర బీమా కోరేగావ్ కుట్ర కేసులో విరసం నేత వరవరరావు ప్రస్తుతం పుణె జైలులో ఉన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న క్రమంలో వరవరరావు, నాగపూర్ యూనివర్శిటీ ప్రొఫెసర్ సోమా సేన్ లు తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ముంబైలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టులో పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్ల పై విచారణ జరిపిన కోర్టువారికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. మహారాష్ట్రలోని పుణె సమీపంలో బీమా కోరేగాం హింసలో మావోయిస్టుల ప్రమేయం ఉందని, ఆ కేసు దర్యాప్తు సందర్భంగా ప్రధాని మోడీ హత్యకు మావోయిస్టులు కుట్ర పన్నారని ఆరోపణలు. ఆ కుట్ర కేసులో ఐదుగురిని అరెస్ట్ చేయగా, అందులో వరవరరావు కూడా ఉన్నారు. దాదాపు ఏడాది కాలంగా బెయిల్ కోసం వరవరరావు ప్రయత్నించినప్పటికి మంజూరు కాలేదు.
సారీ వరవరరావు
Related tags :