వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో ఆయన నటించిన ‘లాహిరి లాహిరి లాహిరిలో’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అందులో ఓ సన్నివేశాన్ని ప్రాణాలకు తెగించి మరీ చేశారు హరికృష్ణ. తన ప్రత్యర్థి జయప్రకాష్‌రెడ్డి ఎదురుగా కారులో వస్తుండగా, ఆగమని హరికృష్ణ లైట్లు వేసినా ఆగకుండా వచ్చేస్తాడు. దీంతో కార్లు రెండూ రైల్వే ట్రాక్‌పైకి వచ్చి సరిగ్గా మధ్యలో ఆగిపోతాయి. కొద్దిసేపటి వరకూ ఎవరూ వెనక్కి తగ్గరు. అదే సమయంలో రైలు వేగంగా వస్తుండటంతో భయపడిన జయప్రకాష్‌రెడ్డి తన కారును వెనక్కి పోనీయమని చెబుతాడు. అయితే, వెంటనే హరికృష్ణ తన కారును స్టార్ట్ చేసి ముందు పోవాల్సి ఉండగా, కారు స్టార్ట్‌కాలేదట. అయినా, హరికృష్ణ భయపడకుండా మరో రెండు, మూడు సార్లు ప్రయత్నిస్తే కారు స్టార్ట్ అయి ముందుకు కదిలింది. లేకపోతే ఆ రోజు పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ఆ సన్నివేశం తర్వాత యూనిట్ సభ్యుల చప్పట్లతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయిందట. దర్శకుడు వైవీఎస్ చౌదరి అయితే ఒక్కసారిగా షాకయ్యారట. అలా కారును ముందుకు నడిపిన తర్వాత హరికృష్ణ చెప్పే డైలాగ్ ఏంటో తెలుసా? ‘మగాడు అన్నాక తెగింపు ఉండాలిరా! చావుకి మనం భయపడకూడదు. చావే మనల్ని చూసి భయపడాలి’! వెండితెరపైనే కాదు, నిజం జీవితంలో హరికృష్ణ చాలా డేరింగ్.
హరికృష్ణ ధైర్యానికి చావు కూడా భయపడింది
Related tags :