* ఏపీలో 143 కి చేరుకున్న కరోనా పాజిటివ్ ల సంఖ్య.
* కరోనా మహమ్మారి నివారించడం కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతోపటిష్టంగా అమలు పరిచేందుకు దాచేపల్లి మండలం లోని ఆంధ్ర తెలంగాణ సరిహద్దులోపొందుగుల శ్రీనగర్ గ్రామాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసిరెండంచెల కట్టుదిట్టమైన భద్రతతో పోలీసు అధికారులు పహారా కాస్తున్నారు.తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్ర సరిహద్దుల్లోకి బైక్ పై స్పీడుగా ప్రవేశించిన గుర్తుతెలియని ఇద్దరు యువకులు పొందుగల చెక్ పోస్ట్ వద్ద పోలీసులు కళ్ళు గప్పి అత్యంత వేగంతో దూసుకుపోతుశ్రీనగర్ చెక్ పాయింట్ వద్ద వాహనాలు రాకుండా అడ్డు పెట్టిన గేట్ ను తప్పించుకునే క్రమంలోబైక్ వెనక వైపు కూర్చున్న యువకుడు గేట్ తగిలి కింద పడి తలకు తీవ్ర గాయం అవడంతోహుటాహుటిన గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారుచికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు.
* దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతుండగా దాదాపు రెండు వారాల తర్వాత దేశీయ విమానాలు తొలిసారిగా గగనయానం చేయనున్నాయి. 18 విమానాలను నడపనున్నట్టు ఎయిర్ ఇండియా సీఎండీ రాజీవ్ బన్సల్ గురువారం వెల్లడించారు. మన దేశంలో చిక్కుపోయిన జర్మనీ, కెనడా, ఫ్రాన్స్, ఐర్లాండ్ పౌరులను తరలించేందుకు వీటిని నడపనున్నట్టు తెలిపారు. ఆయా దేశాల రాయబార కార్యాలయాల అభ్యర్థన మేరకు 18 చార్టడ్ విమానాలను నడుపుతామన్నారు. ఈ మేరకు ఆయా దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్నట్టు చెప్పారు. ఆయా దేశాల నుంచి విమానాలు తిరిగొచ్చేటప్పుడు ఖాళీగానే వస్తాయని స్పష్టం చేశారు.
* కరోనా నియంత్రణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తమ వంతు సాయం అందించేందకు పలువురు ప్రముఖులు, పలు సంస్థలు ముందుకొస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి కియా మోటార్స్ రూ. 2 కోట్ల విరాళం ప్రకటించింది. ఈ మేరకు కియా మోటార్స్ ఇండియా ఎండీ కుక్ హయాన్ షిమ్ గురువారం సీఎం వైఎస్ జగన్‌ను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిసి విరాళాలకు సంబంధించిన వివరాలను అందజేశారు.
* కరోనా వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వచ్చిన వైద్యుల పట్ల అనుచితంగా ప్రవర్తించడమే కాక వారిపై దాడికి తెగబడ్డ నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసిన ఘటన గురువారం మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. కోవిడ్-19 (కరోనా వైరస్) రోగులతో సన్నిహితంగా మెదిలిన వారిని పరీక్షించే నిమిత్తం వైద్య బందాలు ఇండోర్‌లోని తటపట్టి బఖల్ ప్రాంతానికి చేరుకున్నాయి. దీన్ని వ్యతిరేకించిన స్థానికులు వైద్యులను కించపరుస్తూ మాట్లాడటమే కాక వారిపై ఉమ్మివేస్తూ రాళ్లదాడి చేశారు. దీంతో వాళ్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ దాడిలో మహిళా డాక్టర్లకు గాయాలయ్యాయి. విషయం తెలసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా అక్కడి స్థానికులు బారికేడ్లను సైతం ధ్వంసం చేశారు.
* కరోనా వైరస్ బారిన పడకుండా ఇంట్లో ఉండండి, తగిన జాగ్రత్తలు పాటించండి అంటూ పాట కట్టి మరీ చెప్తున్నారు సెలబ్రిటీలు. అలా కరోనాపై అవగాహన కల్పించే పాటలు ఈ మధ్య చాలానే పుట్టుకొచ్చాయి. తాజాగా ప్రముఖ ర్యాప్ సింగర్ ఎమీవే బంతాయ్ జనాలను చైతన్యపర్చిందేకు పూనుకున్నాడు. కరోనాను ఖతం చేద్దాం అంటూ పాట ద్వారా ప్రజలకు పిలుపునిచ్చాడు. అయితే ఈ విపత్తుకు మానవ తప్పిదాలు (ప్రకతి విధ్వసం వంటివి) కారణమన్న విషయాన్ని ఎత్తి చూపాడు. భారత ప్రధాని నరేంద్రమోదీ “జనతా కర్ఫ్యూ పాటించండి” అని కోరుతున్న క్లిప్పింగ్‌ను కూడా పొందుపరించాడు. సినిమా, కార్టూన్స్, వైరల్ వీడియోల సన్నివేశాలను ఈ పాటలో వినియోగించాడు.
* ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో మార్చి పదవ తేదీ నుంచి 13వ తేదీ వరకు ‘తబ్లిగ్ జమాత్’ నిర్వహించిన మూడు రోజుల మత సమ్మేళనం నేడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కార్యక్రమానికి కరోనా వైరస్ విస్తరించిన దేశాల నుంచే కాకుండా భారత్‌లోని పలు రాష్ట్రాల నుంచి కూడా దాదాపు 2000 మంది ముస్లింలు హాజరవడం, వారిలో దాదాపు 150 మందికి వైరస్ సోకినట్లు ఇప్పటికే నిర్ధారణ అవడం, వారిలో ఏడుగురు మరణించడం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది.
* దేశంలో కరోనా విజృంభన తగ్గుతుందనుకున్న సమయంలో ఢిల్లీ నిజాముద్దీన్ ఘటన ఒక్కసారిగా అందరిలోనూ దడపుట్టిస్తోంది. తాజాగా అస్సాంలోని ముగ్గరు వ్యక్తులకు కరోనా సోకింది. దీంతో 36 గంటల్లోనే అస్సాంలో కోవిడ్-19 కేసులు సున్నా నుంచి 16కి పెరిగాయి. వీరందరూ గత నెలలో నిజాముద్దీన్‌లోని తబ్లీగి జమాత్‌కు హాజరైనవారే. దీంతో ఈ బృందం నాయకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అస్సాంలో ఒక్కసారిగా కేసులు పెరిగిపోవడంతో ముఖ్యమంత్రి సర్భనాడ సోనోవాల్ స్పందించారు.” రాష్ర్టం ఇప్పుడు క్లిష్టమైన దశకు చేరుకుంది. కులం, మతంతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరు లాక్‌డౌన్ నిబంధనలను పాటించాలి”. అని కోరారు.