ఇప్పుడు ఎక్కడ చూసినా, విన్నా కరోనా మాటలే వినిపిస్తున్నాయి. పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి మరి. అందుకేనేమో డిజైనర్లు, ఫ్యాషనిస్టులు ప్రతీదాన్ని వినియోగించుకుంటున్నారు. ఆ ఉపయోగంలో కూడా న్యాయం చేస్తున్నారు. ఏంటంటారా.. బేకరీలో పనిచేసే చెఫ్‌లు ఇప్పడు కొత్తగా క్రియేటివిటీగా పనిచేస్తున్నారు. వాటితో ఒక సందేశాన్ని కూడా ఇస్తున్నారు. ఎగ్ పఫ్, నాన్‌వెజ్ పఫ్, వెజ్ పఫ్‌లంటే ఈ కాలం యువతకు చాలా ఇష్టం. అవి తిని కడుపు నింపుకునేవారు చాలామందే ఉన్నారు.యఇప్పుడు కరోనావైరస్ నేపథ్యంలో బర్గర్లు తయారు చేసి అందరిని అబ్బురపరుస్తున్నారు చెఫ్‌లు. అది ఎక్కడంటే.. హనోయిలోని హాంగ్ టంగ్ అనే చెఫ్ గ్రీన్, బ్రౌన్ కలర్స్‌లో బర్గర్లు, బన్నులను తయారు చేస్తున్నాడు. వీటిని మైక్రోస్కోపిక్ పొటోల ఆధారంగా చేస్తున్నారు.
ఇలా చేయడానికి కూడా ఓ కారణం ఉంది. ముళ్లును ముళ్లుతోనే తీయాలి అంటారు పెద్దలు.అందుకే కరోనా పేరు చెప్పగానే భయపడేవారికి ఆ భయాన్ని తొలగించేందుకు ఈ బర్గర్లు, బన్నులను వైరస్ రూపంలో పోగొడుతున్నారు. వీటి ప్రాముఖ్యతను తెలియజేయడంతో ఆ బేకరికి బాగా గిరాకి పెరిగింది. రోజుకు 50 వరకు అమ్మడుపోతున్నాయి. అప్పటినుంచి ఆదాయం కూడా పెరిగింది. రోజురోజుకి కోవిడ్-19 కేసులు పెరగడంతో అక్కడున్న షాపులు, దుకాణాలు మూసివేయాలని ఆర్డర్లు వచ్చాయి. దాంతో వీరి బేకరి కూడా మూసేయాలి. ఆ పరిస్థితుల్లో తయారు చేసిన బర్లర్లును హాంగ్ టంగ్ అతని అంకుల్ కలిసి కరోనాపై అవగాహన కల్పిస్తూ ఆహారాన్ని చేరవేస్తున్నారు . ఇలా ప్రతిఒక్కరూ వారికి తెలిసిన రీతిలో వైరస్‌ను తరిమికొట్టేందుకు పాటుపడుతున్నారు.