తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. ఈ ఒక్కరోజే 75 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.ఈ మేరకు మంత్రి ఈటల రాజేందర్ ఓ ప్రకటన విడుదల చేశారు. తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 229కి చేరింది. కరోనాతో ఈరోజు ఇద్దరు మృతిచెందారు. సికింద్రాబాద్, షాద్ నగర్‌కు చెందిన వ్యక్తులు మృతిచెందగా.. మృతుల సంఖ్య 11కి చేరింది. మరోవైపు కరోనా సోకి కోలుకున్న వారిలో 15 మంది ఈరోజు డిశ్చార్జ్ అవగా.. ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 32కి చేరింది. ప్రస్తుతం ఐసోలేషన్ వార్డుల్లో 186 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు.
తెలంగాణాలో నేడు ఒక్కరోజే 75కేసులు

Related tags :