మామూలు రోజుల్లో మాదిరిగా కాయగూరలు ఎప్పుడంటే అప్పుడు తెచ్చుకోవడం కుదరడం లేదు. అందుకే ఒకేసారి తెచ్చుకున్న కూరలు పాడవకుండా వాటిని ఎక్కువ కాలం ఎలా నిల్వ చేసుకోవాలో చూద్దాం!
* బఠానీలు, బ్రకోలీ, పాలకూర, తోటకూర, చిక్కుడుకాయ లాంటి కూరగాయలను ఫ్రీజర్‌లో భద్రపరిచే ముందు మరిగే నీటిలో అరనిమిషం పాటు వేసి తీయాలి. ఇవి పూర్తిగా చల్లారిన తరువాతే జిప్‌లాక్ బ్యాగులు, డబ్బాల్లో వేసి ఫ్రీజర్‌లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.
* టమాటాలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, బంగాళాదుంపలను ఫ్రిజ్‌లో పెట్టకూడదు. సూర్యకాంతి పడకుండా గది ఉష్ణోగ్రత వద్ద వీటిని ఉంచితే.. ఎక్కువకాలం తాజాగా ఉంటాయి.
* పాలను డీప్ ఫ్రిజ్‌లో భద్రపరిస్తే ఎక్కువ రోజులు వాడుకోవచ్చు.
* ఏ పదార్థాన్నైనా మొదట చల్లార్చిన తరువాతే ఫ్రీజ్ చేయాలి. ఒకవేళ పదార్థం వేడిగా ఉంటే దాని ఉష్ణోగ్రత వల్ల మిగతావీ పాడయ్యే ప్రమాదం ఉంది.
* మాంసం లాంటి వాటిని కూడా మొదట ఉడికించి, చల్లార్చిన తరువాతే శీతలీకరణం చేయాలి.
* ఫ్రీజర్‌లో భద్రపరిచే ఆహారాన్ని గట్టిగా మూత ఉండే డబ్బాల్లో పెట్టుకోవాలి
* తురిమిన చీజ్‌ను కొద్దికొద్దిగా మఫిన్స్‌లో వేసుకుని ఫ్రీజర్‌లో నిల్వ చేసుకోవచ్ఛు పెరుగును కూడా ఇలాగే నిల్వ చేసుకోవచ్చు.
**పచ్చళ్లుగా…
మాంసం, దోసకాయ, టమాటా, నిమ్మకాయ, కాలీఫ్లవర్, మామిడికాయ, బీట్రూట్… వీటిని వెనిగర్ లేదా నిమ్మరసం, మెంతిపొడి కలిపి, ఎక్కువ నూనె, ఉప్పు లేకుండా పచ్చళ్లుగా తయారుచేసుకుని కొన్నాళ్లపాటు నిల్వ చేసుకోవచ్చు.
**ప్యూరీగా…
అరటి, బొప్పాయి, కమలా పండ్లను శుభ్రంగా కడిగి గుజ్జులా చేసి గాలిచొరబడని డబ్బాల్ల్లో భద్రపరుచుకుంటే సరి. కావాలనుకున్నప్పుడు స్మూథీలు, జ్యూస్‌లుగా చేసుకోవచ్చు.
* బంగాళాదుంపలను సన్నటి చిప్స్‌లా కోసి… మరిగే నీటిలో నిమిషంపాటు ముంచి తీయాలి. ఆ తరువాత చల్లార్చి కాస్తంత నూనె రాసి ఫ్రీజర్‌లో పెట్టుకోవచ్చు.
* గుడ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే.. వీటిని మొదట పగలగొట్టి ఒక గిన్నెలో వేసి బాగా గిలక్కొట్టాలి. ఆ తరువాత ట్రేల్లో పోసి ఫ్రీజర్‌లో భద్రపరుచుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.
కూరగాయలు తాజాగా ఇలా నిల్వ చేసుకోండి
Related tags :