అనగనగా ఏడుగురు అక్కాచెల్లెళ్లు. న్యూయార్క్ వాళ్ల ఊరు. పేద టర్కీ రైతు కుటుంబంలో పుట్టిన వాళ్లందరికీ పొడవాటి జుట్టు ఉండేదట. వాళ్లమ్మ ఆ జుట్టుని కత్తిరించనిచ్చేదికాదట. పైగా అది మెరిసేందుకు ఒకలాంటి వాసన వచ్చే నూనె రాసేదట. వాళ్లని చూసి స్కూల్లో పిల్లలు ఏడిపించేవారు. కానీ వాళ్లు చర్చిల్లో పాటలు పాడుతుంటే అంతా ఆ జుట్టునే చూసేవారట. అది గమనించిన వాళ్ల నాన్న ‘సింగింగ్ యాక్ట్’ పేరుతో వాళ్లను దేశమంతా తిప్పుతూ పాడించేవాడు. కొన్నాళ్లకే వాళ్లు పొడవుజుట్టు సిస్టర్స్, సెవెన్ సదర్‌ల్యాండ్ సిస్టర్స్గానూ ప్రాచుర్యం పొందారు. క్రమంగా పాటలకన్నా వాళ్ల జుట్టు చూడ్డానికే జనం పోగయ్యేవారు. దాంతో బార్నమ్ అండ్ బెయిలీ సర్కస్ ఆ సిస్టర్స్‌తో ఒప్పందం కుదుర్చుకోవడంతో దేశమంతా వాళ్ల పేరు మార్మోగిపోయింది. తమ శిరోజాలకు వాడే నూనెను సైతం విక్రయించడం ప్రారంభించారు. ఇంకేముంది… కేశాలతో వాళ్ల సంపద ఇంతింతై వటుడింతై అన్నట్లు పెరిగిపోయింది. కానీ డబ్బుతో వాళ్ల అలవాట్లూ మారాయి. డ్రగ్స్, ఆల్కహాల్లతోబాటు విలాసాలూ పెరిగిపోయాయి. దానికితోడు ఇరవయ్యో శతాబ్దంలో బాబ్డ్ హెయిర్ ఫ్యాషన్ రావడంతో జనంలో పొడవు జుట్టు షోలకీ ఉత్పత్తులకీ ఆదరణ తగ్గింది. కానీ వాళ్ల అలవాట్లు మారలేదు. దాంతో ఎలా వచ్చిన సంపద అలాగే పోయి పేదరికంతోనే మరణించారట. పొడవు జుట్టు సోదరీమణులుగా వాళ్ల పేరు మాత్రం చరిత్రలో నిలిచిపోయింది.
కేశ సౌందర్యానికి కేరాఫ్ అడ్రస్…
Related tags :