DailyDose

ఇండియాలో 2586 కొరోనా కేసులు. ఏపీలో 161-TNI కథనాలు

Total COVID19 Cases In India Climbs To 2586-TNILIVE Specials

* భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్దేశవ్యాప్తంగా 2586 మందికి సోకిన కరోనా,73 మంది మృతిదేశవ్యాప్తంగా కోలుకున్న 192 మంది బాధితులుమహారాష్ట్రలో అత్యధికంగా 423 పాజిటివ్ కేసులు,21 మంది మృతితమిళనాడు లో 309 పాజిటివ్ కేసులు,ఒకరు మృతిఢిల్లీలో 293 కేసులు,నలుగురు మృతికేరళలో 286 పాజిటివ్ కేసులు,ఇద్దరు మృతిఆంధ్రప్రదేశ్ లో 161 కేసులురాజస్థాన్ లో 154 కేసులుతెలంగాణ 154 కేసులు,9 మంది మృతిఉత్తరప్రదేశ్ లో 128 పాజిటివ్ కేసులు,ఇద్దరు మృతికర్ణాటకలో 124 పాజిటివ్ కేసులు,ముగ్గురు మృతిమధ్యప్రదేశ్ 107 కేసులు,8 మంది మృతిగుజరాత్ 95 కేసులు,8 మంది మృతిజమ్మూకాశ్మీర్ 70 కేసులు,ఇద్దరు మృతిపశ్చిమ బెంగాల్ 53కేసులు,ఆరుగురు మృతిహర్యానాలో 49 కేసులుపంజాబ్ లో 47 కేసులు,ఐదుగురు మృతిబీహార్ 29 కేసులు,ఒకరు మృతిచండిఘడ్ 18,అస్సాం16,లడక్ 13,అండమాన్ 10,చత్తీస్గఢ్ 9,ఉత్తరాఖండ్ 10,గోవా 6,హిమచల్ 6 కేసులు ఒకరు మృతి,ఒడిశా 5,ఝార్ఖండ్ 2,మిజోరాం 1,మణిపూర్ 2,పుదుచ్చేరి 5,అరుణాచల్ ప్రదేశ్ 1 కేసు నమోదు??రాష్ట్రాలు విడుదల చేసిన అధికారిక లెక్కల ప్రకారం వివరాలు

* ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా వ్యాధి సోకింది. మొదట కుటుంబ యాజమానికి ఈవ్యాధి లక్షణాలు బయటపడగా, ఆ తర్వాత అతని కుటుంబసభ్యులందరికీ పరీక్షలు నిర్వహించడంతో వారిలో శుక్రవారం మరో ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మెదక్‌ పట్టణంలోని ఆజంపురకు చెందిన 56 ఏళ్ల వ్యక్తి దిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌కు వెళ్లి గతనెల 21న స్వస్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత అతడ్ని వైద్య పరీక్షల నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి పంపి నమూనాలు పరీక్షించగా పాజిటివ్‌గా తేలింది. దీంతో అప్రమత్తమైన వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు అతడి కుటుంబసభ్యులందరికీ బుధవారం మెదక్‌లోని ప్రాంతీయ ఆస్పత్రిలో నమూనాలు సేకరించి నిర్ధారణ కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి పంపారు.

* కరోనా వైరస్‌ ప్రభావంతో లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి అవసరమైన సాయం చేసేందుకు దేశ వ్యాప్తంగా భాజపా కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేసింది. మొత్తం 35 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో 35 కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేసినట్టు ఆ పార్టీ వెల్లడించింది.

* సెలవు దొరికితే ఏ సినిమాకో, షికారుకో వెళ్లడం సగటు భారతీయుడి అలవాటు. సాధారణ రోజుల్లో అయితే బస్టాండ్లకు పోటెత్తుతారు. రైల్వేస్టేషన్లు కిక్కిరిసిపోతాయి. పార్కులు నిండిపోతాయి. లాక్‌డౌన్‌ పుణ్యమా ఇవన్నీ బంద్‌. నిత్యావసరాల దుకాణాలు, మెడికల్‌ షాపులు మినహా..! దీంతో జనం ఇళ్లకే పరిమితమయ్యారు. దీనిపై ప్రముఖ సెర్చింజిన్‌ గూగుల్‌ ఆసక్తికర డేటా వెల్లడించింది. మొబైల్‌ లోకేషన్‌ డేటాను ఉపయోగించి దేశంలోని ప్రజల కదలికలకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. మొత్తం 131 దేశాలకు సంబంధించిన డేటాను కొవిడ్‌-19 కమ్యూనిటీ మొబిలిటీ రిపోర్ట్‌ పేరిట గూగుల్‌ విడుదల చేసింది.

* కరోనాపై పోరాటానికి విశ్రాంత వైద్యులు, నిపుణులను ఆహ్వానించినట్టు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది కూడా ముందుకొచ్చారన్నారు. వైద్య సిబ్బందికి వ్యక్తిగత భద్రతా దుస్తులను అందిస్తామన్నారు. అత్యవసర వైద్య పరికరాలు, ఔషధాలు సమకూర్చడంలో రాజీపడటంలేదన్నారు. క్వారంటైన్‌లలో సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ఈ సమయంలో ప్రజల నుంచి సహకారం లేకపోతే అన్నీ వృథానే అన్నారు. లాక్‌డౌన్‌కు అందరూ సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

* రాష్ట్రంలో ఇప్పటివరకు 19,364 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారనీ.. ఇంకా 7222 మంది క్వారంటైన్లో ఉన్నారని తెలంగాణ గవర్నర్‌ తమిళి సై తెలిపారు. శుక్రవారం గవర్నర్లతో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంగా తెలంగాణలో కరోనా కట్టడి, లాక్‌డౌన్‌ అమలు తీరును గవర్నర్‌ తమిళి సై వివరించారు. ‘‘ ఇప్పటివరకు రాష్ట్రంలో 2400 మంది నమూనాలను పరీక్షించారు. దిల్లీ మర్కజ్‌కు వెళ్లొచ్చినవారిలో 925 మందిని గుర్తించారు. అందులో 79 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. రాష్ట్రంలోని 31 ఆస్పత్రుల్లో 12,500 పడకలు సిద్ధంగా ఉన్నాయి’’ అని తెలిపారు.

* కరోనాపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ హెచ్చరించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట గరికపాడులో ఏపీ-తెలంగాణ సరిహద్దు చెక్‌పోస్టు వద్ద లాక్‌డౌన్‌ పరిస్థితులు, భద్రతను డీజీపీ పరిశీలించారు. అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శ్రీకాకుళం, నాగార్జునసాగర్‌, విజయనగరం జిల్లా సాలూరు, ఇతర చెక్‌పోస్టుల సిబ్బందితో మాట్లాడి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సరిహద్దు వద్ద హైవేలపై దాబాల ఏర్పాట్లు, ఎన్ని వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి తదితర విషయాలపై డీజీపీ ఆరా తీశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతమున్న విపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఒక వర్గం లేదా ఒక వ్యక్తిని టార్గెట్‌ చేస్తూ ఎలాంటి అసత్య ప్రచారాలు చేయొద్దని డీజీపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోలీసులు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది కరోనా బాధితుల విషయంలో విస్తృతంగా పనిచేస్తున్నారని.. ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న వారికి సహకారం అందించాలని ప్రజలను కోరారు.