ఇంట్లో ఎంత రెడీ అయినా బయట అడుగు పెట్టేటప్పడు మాత్రం శరీరానికి పర్‌ఫ్యూమ్ వాడాల్సిందే. ఇది సువాసన వెదజల్లడమే కాదు. ఆ మనిషి ఎలాంటి వారో తెలియజేస్తున్నది. అలాంటప్పుడు ఏది పడితే అది వాడితే ఎలా. సరైనది ఎంచుకోవాలి. అందుకే ఎవరు ఎలాంటి పర్‌ఫ్యూమ్ వాడాలో తెలుసుకుంటే బెటర్. అమ్మాయిలు ఎవరు ఎలాంటి పర్‌ఫ్యూమ్ వాడితే మంచిదో తెలియజేసేందుకు రూమెన్ కొన్ని ప్రాడక్ట్స్‌ను కనుగొన్నారు. అవేంటో ఎలాంటి వారికో పూర్తి వివరాలు.
సిగ్గుపడేవారు
చాలామంది అమ్మాయిలు కొత్తవారిని చూసిన, ఇతరులను ఏదైనా అడగాలన్నా చాలా సిగ్గుపడుతుంటారు. వారు లావెండర్, చెర్రీ ఫ్లేవర్లు వాడితే మంచిది. దీనిని బట్టి ఎదుటివారికి సులువుగా అర్థమవుతుంది. ఇది మూలికలతో తయారవుతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు.
రొమాంటిక్ మహిళలు
కొంతమంది అమ్మాయిలు చూడడానికి అమాయకంగా ఉన్నా వారు చాలా రొమాంటిక్. మరికొంతమంది చలాకీగా ఉన్నప్పటికీ వారు కాస్త నెమ్మదస్తులు. ఇలాంటి వారిని ముందుగానే కనిపెట్టడానికి రోజ్ ఫ్లేవర్ వాడితే మంచిది. దీనిని బట్టి వారు రొమాంటిక్ అని అర్థమవుతుంది.
లోతుమనుషులు
ఎన్ని ప్రశ్నలు వేసినా కొన్ని సమాధానాలు బయటకు చెప్పరు. అలాంటి వారిని లోతుమనుషులు అంటారు. వీరు వివిధ రకాల వనమూలికతో తయారు చేసిన వనిల్లా ఫ్లేవర్ పర్‌ఫ్యూమ్‌ను వాడాలి.
స్మార్ట్‌గా ఉండేవారు
అమ్మాయిలల్లో చాలామంది స్మార్ట్‌గా ఉంటారు. దానికి కారణం వారి దుస్తులు. పద్ధతులు. అలాంటి వారి ఆలోచనలు ఎలా ఉంటాయో తెలియజేసేందుకు మస్క్, వనిల్లా, అంబర్ ఫ్లేవర్లతో తయారు చేసిన పర్‌ఫ్యూమ్లను వాడొచ్చు.
సాధారణ మహిళ
ఆడంబరంగా ఉండేవారికన్నా సాధారణంగా ఉండేందుకు ఎక్కువమంది ఇష్టపడుతారు. గొప్పవాళ్ళంతా సాదాసీదాగానే బతుకుతారు. అలాంటి వారు ఎక్కువగా గంధం, అంబర్, వివిధ రకాల పూలతో వచ్చిన ఫ్లేవర్ల పర్‌ఫ్యూమ్లు వాడితే మంచిది.
ఫన్నీగా ఉండేవారు
కొంతమంది ఎందరిలో ఉన్న ఇట్టే కలిసిపోతారు. కారణం వారు ఫన్మీగా ఉంటారు. అందరిలో కలిసి పోవడం వారి ప్రత్యేకం. ఇలాంటి వారు సిట్రస్, ఆపిల్, వనిల్లా కలిగిన ఫ్లేవర్లను వాడితే బెటర్.
పాజిటివ్ మెంటాలిటీ
ఎలాంటి విషయాల్లో అయినా పాజిటివ్‌గా ఆలోచించదు మంచిది అంటారు. అలా ఎక్కువమంది ఉండలేకపోవడంతో ఎక్కువ గొడవలకు పోతుంటారు. పాటిటివ్ పర్సన్‌లు వివిధ రకాల మూలికలు, అడవుల్లో దొరికేపూలతో తయారు చేసిన పర్‌ఫ్యూమ్ వాడాలని నిపుణులు చెబుతున్నారు.