Movies

జయలలిత పక్కన నేను చేయను

Balakrishna Jayalalitha-Telugu Movie News

నందమూరి నటసింహ బాలకృష్ణ ఓ ఆఫర్‌కు నో చెప్పేశారట. కారణాలేవో తెలీదు గానీ ఆ పాత్రను చేయలేని చెప్పేశారట. ఇంతకు ఆ పాత్ర ఏంటంటే సీనియర్ ఎన్టీఆర్ పాత్ర. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ఏఎల్ విజయ్‌.. తలైవి చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ మూవీ షూటింగ్ క్లైమాక్స్‌కు వచ్చేసింది. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ పాత్ర కోసం యూనిట్ బాలయ్యను సంప్రదించారట. ఎన్టీఆర్, జయలలితల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. సినిమాల పరంగానే కాదు.. రాజకీయంగానూ వీరిద్దరు క్లోజ్‌గా ఉండేవారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య స్నేహాన్ని సినిమాలో చూపించాలనుకున్న దర్శకుడు.. ఆ పాత్ర కోసం బాలయ్యను సంప్రదించారట. కానీ పెద్దగా కారణాలేవీ చెప్పకపోయినా ఆ ఆఫర్‌కు ఆయన నో చెప్పారట.

Jr NTR, Balayya not approached for Kangana Ranaut's Thalaivi ...