బాలీవుడ్‌లో అత్యంత ఆదరణ పొందిన జంటలలో ఒకరైన దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్ లు తమ సోషల్ మీడియా పోస్టులతో అభిమానుల మనసులను గెలుచుకుంటుంటారు. లాక్డౌన్ నేపథ్యంలో వీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్నారు. దీపిక తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో తన భర్త రణ్‌వీర్ సింగ్ పిల్లి అని వ్యాఖ్యానించింది. పిల్లులు దాదాపు 70 శాతం సమయం నిద్రపోతాయి. అందుకే రణ్‌వీర్ సింగ్ ఇప్పుడు పిల్లి అని వివరణ ఇచ్చింది. ఈ కామెంట్ తో పాటు దీపిక రణవీర్ సింగ్ నిద్రిస్తున్న ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోలో రణవీర్ నుదిటిపై భర్త అనే లేబుల్ అతికించి ఉంది. దీపిక షేర్ చేసిన ఈ ఫోటో అభిమానులను అలరిస్తోంది.
ఆయన పిల్లి
Related tags :