* ఏపీలో అత్యధికంగా కర్నూల్ జిల్లాలో 53 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. వైద్య ఆరోగ్య శాఖ వెల్లడి.
* ఆంథ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగుండి కూడా ఉద్యోగ,ఉపాధ్యాయ,కార్మిక మరియు పెన్షనర్ల జీతాలలో 50%కోత విధించడానికి నిరసనగా “ది6-4-2020 ఉదయం 9గంటల నుండి సాయంత్రం5 గంటల” వరకు గుంటూరు జెకెసి కాలేజ్ రోడ్ , విజయపురి 3వ లైన్ లోని తన స్వగృహం నందు కృష్ణా,గుంటూరు ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు విద్యావేత్త డాక్టర్ ఏ.యస్.రామకృష్ణ(9848582069) ఒక రోజు అనగా 6-4-2020 సోమవారం ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు నిరసన దీక్ష చేస్తున్నారు.
* కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో సమాజం తనని బహిష్కరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన హిమాచల్‌ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో జరిగింది. గ్రామస్థులంతా తనని దూరం పెట్టారనే బాధతో 37 ఏళ్ల మహ్మద్ దిల్షాద్ ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడని డీజీపీ సీతారామ్ తెలిపారు.
* తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 300 దాటింది. అత్యధికంగా హైదరాబాద్ 140మంది కరోనా బారిన పడినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
* ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం ఉదయం 10 గం.ల నుంచి సాయంత్రం 5 వరకూ కర్నూలులో 26 కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 252కు చేరింది. వీటిలో కర్నూలు(53) అత్యధిక పాజిటివ్ కేసులు నమోదవడం గమనార్హం.
* జిల్లాలో 53 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో కర్నూలు జిల్లా యంత్రాంగం పటిష్ఠ చర్యలు చేపట్టింది. పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన పలు పట్టణాలను కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించింది. దీంతో ఆయా ప్రాంతాల్లో రెండు రోజుల పాటు నిత్యావసరాలను సైతం నిలివేయనున్నారు. కర్నూలు నగరంతో పాటు నంద్యాల, కోడుమూరు, నందికొట్కూరు, బనగానపల్లె, ఆత్మకూరు, గడివేముల, పాణ్యం, అవుకు పట్టణాలను కంటైన్‌మెంట్ జోన్లుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు జిల్లాలో నిన్నటి వరకు 4 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. అయితే ఈరోజు 23 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై చర్యలు చేపట్టింది.