* కొవిడ్-19 మహమ్మారితో భారత ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి తన వంతు సాయంగా అవెన్యూ సూపర్‌మార్ట్స్ (డి-మార్ట్) ప్రమోటరు రాధాకిషన్ దమానీ రూ.155 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇందులో రూ.100 కోట్లు పీఎం కేర్స్ నిధికి ఇవ్వగా.. మిగిలిన రూ.55 కోట్లను 11 రాష్ట్రాల ప్రభుత్వాల సహాయ నిధికి అందజేసినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. పీఎం కేర్స్ నిధికి రూ.100 కోట్ల విరాళాన్ని అదానీ గ్రూపు అందజేయనుంది. గ్రూపు సంస్థల ఉద్యోగులు కలిపి మరో రూ.4 కోట్లను విరాళంగా ఇచ్చారని సంస్థ తెలిపింది. దేశ ప్రజలకు పలు చర్యల రూపేణా సాయం అందిస్తున్న ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు సి.కె.బిర్లా గ్రూపు ముందుకొచ్చింది. పీఎం కేర్స్ నిధికి రూ.25 కోట్లు విరాళంగా ఇవ్వనుంది. అలాగే రాష్ట్రాలకు సాయం అందించేందుకు, వైద్య పరికరాల కొనుగోలు నిమిత్తం మరో రూ.10 కోట్లు విరాళంగా అందజేయనున్నట్లు తెలిపింది.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2020-21) ఫారం 15జీ, 15హెచ్‌ల సమర్పణ విషయంలో ఆదాయపు పన్ను శాఖ వెసులుబాటు కల్పించింది. జూన్ 30 తర్వాత నుంచి వీటిని సమర్పించేందుకు అనుమతినిచ్చింది. ఆదాయపు పన్ను పరిధిలోకి రాని వ్యక్తులు తమకు వచ్చే వడ్డీ ఆదాయంపై టీడీఎస్ (మూలం వద్ద పన్ను కోత) మినహాయించుకోవద్దని కోరుతూ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు సాధారణంగా ఏప్రిల్‌లో ఈ ఫారంలను సమర్పిస్తుంటారు. వయోవృద్ధులు ఫారం 15హెచ్‌ను, పన్ను పరిధిలోకి వచ్చేంత ఆదాయం లేని వ్యక్తులు ఫారం 15జీని దాఖలు చేస్తారు. అయితే కొవిడ్-19 నేపథ్యంలో జూన్ 30 తర్వాత నుంచి దాఖలు చేసుకునేందుకు సీబీడీటీ వీలు కల్పించింది. అలాగే 2019-20కి సమర్పించిన ఫారం 15జీ, 15హెచ్‌లే జూన్ 30 వరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కూడా వర్తిస్తాయి. కరోనా కలవరం నేపథ్యంలో ప్రత్యేకంగా ఫీవర్ క్లినిక్‌లను అందుబాటులోకి తెస్తున్నట్లు అపోలో గ్రూపు ఆసుపత్రుల ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్.సి రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు మీడియాకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సాధారణ జ్వరం, జలుబుకు సైతం ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. కరోనా వైరస్ కారణంగా జ్వరం వచ్చిందా.. మరేదైనా కారణం ఉందా? అని ఆందోళనకు గురవుతున్నారు. తాము ఏర్పాటుచేయనున్న ఫీవర్ క్లినిక్‌లతో అలాంటి ఇబ్బందులు తీరనున్నాయని పేర్కొన్నారు. తొలిదశలోభాగంగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరులలో కలిపి 21 క్లినిక్‌లను ప్రారంభిస్తున్నట్లు ఆయన వివరించారు.
* విమాన ప్రయాణికులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది ఎయిర్‌పోర్ట్సు ఎకనమిక్ రెగ్యులేటరీ అథారిటీ (ఏఈఆర్‌ఏ). దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించే వారి నుంచి వసూలు చేసే యూజర్ డెవలప్‌మెంట్ ఛార్జి(యూడీసీ)ని భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈనెల 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ తగ్గింపు అమల్లో ఉంటుంది.
* కరోనా కలవరం నేపథ్యంలో ప్రత్యేకంగా ఫీవర్ క్లినిక్‌లను అందుబాటులోకి తెస్తున్నట్లు అపోలో గ్రూపు ఆసుపత్రుల ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్.సి రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు మీడియాకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సాధారణ జ్వరం, జలుబుకు సైతం ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. కరోనా వైరస్ కారణంగా జ్వరం వచ్చిందా.. మరేదైనా కారణం ఉందా? అని ఆందోళనకు గురవుతున్నారు. తాము ఏర్పాటుచేయనున్న ఫీవర్ క్లినిక్‌లతో అలాంటి ఇబ్బందులు తీరనున్నాయని పేర్కొన్నారు. తొలిదశలోభాగంగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరులలో కలిపి 21 క్లినిక్‌లను ప్రారంభిస్తున్నట్లు ఆయన వివరించారు.