‘‘లాక్ డౌన్ సమయంలో అందరూ ఇళ్లలోనే ఉంటున్నారు. భర్తలందరూ తమ భార్య చేస్తున్న పనిని పంచుకోండి’’ అంటున్నారు శ్రియ. లాక్ డౌన్‌లో చాలామంది సెలబ్రిటీలు రకరకాల చాలెంజ్‌లు విసురుతున్నారు. వర్కౌట్స్ చేయమని, పుస్తకాలు చదవమని ఇలా రకరకాల చాలెంజ్‌లు అన్నమాట. తాజాగా హీరోయిన్ శ్రియ కొత్త చాలెంజ్ విసిరారు. ఇది కేవలం భర్తలకు మాత్రమే. ‘‘నేను మా ఆయన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నానో మీకు తెలుసా? ఎందుకంటే ఆయన గిన్నెలు బాగా శుభ్రం చేస్తారు కనుక (నవ్వుతూ). మీరు (భర్తలను ఉద్దేశించి) కూడా ఈ సమయంలో మీ భార్యకు ఏదో విధంగా సహాయపడండి. దాన్ని వీడియోగా షేర్ చేయండి’’ అంటూ ఓ వీడియోను షేర్ చేసి, తన ఫ్రెండ్స్ కొందరికి ఈ చాలెంజ్ విసిరారు శ్రియ. 2018లో ఆండ్రూ కొచీవ్, శ్రియ వివాహం చేసుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం ఈ ఇద్దరూ స్పెయిన్‌లో ఉంటున్నారు.
భర్త అంటే బొచ్చెలు బాగా కడుగెడివాడు
Related tags :