Food

వైరస్ కన్నా భయంకరంగా ఉంది…ఈ బెంగాలీ స్వీటు

వైరస్ కన్నా భయంకరంగా ఉంది…ఈ బెంగాలీ స్వీటు

బెంగాలీలకు స్వీట్లు అటే చాలా ఇష్టం. ముఖ్యంగా సందేశ్. దానిని సొమ్ము చేసుకోవాలని అనుకున్నారో ఏమో.. ఓ మిఠాయి దుకాణం వారు వెరైటీగా కరోనా సందేశ్ అనే స్వీట్ తయారు చేశారు. బంతిలా గుండ్రంగా ఉండి అచ్చం కరోనా వైరస్ లాగా పైన బుడిపెలు కూడా పెట్టారు. ఓ వైపు కోరనా అంటే దడుసుకు చస్తున్న జనం ఈ స్వీట్ పట్ల అంతగా ఆసక్తి కనబర్చలేదు. కొందరైతే సోషల్ మీడియాలో ఈ స్వీట్ ను తిడుతూ పోస్టులు కూడా పెట్టారు. ఇటీవలే బెంగాలీల స్వీట్ల మోజును దృష్టిలో ఉంచుకుని కొన్ని మిఠాయి అంగళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతి ఇచ్చిన సంగతి, జనం ఎగబడి కొనుక్కున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా స్వీట్ బెంగాలీలకు కొంచెం అతి అనిపించినట్టుంది.