Sports

బ్యాడ్మింటన్ టోర్నీలు గోవిందా

Badminton Tournaments Postponed Until Further Announcements

ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌ ప్రభావం క్రీడారంగంపై కొనసాగుతూనే ఉంది. జులై వరకు ఎటువంటి బ్యాడ్మింటన్‌ టోర్నీలూ నిర్వహించబోమని ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) తెలిపింది. మే-జులైలో జరగాల్సిన అంతర్జాతీయ, జూనియర్‌, పారా టోర్నమెంట్స్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని సోమవారం ప్రకటించింది. దీంతో హెచ్‌ఎస్‌బీసీ బీడబ్ల్యూఎఫ్ టూర్‌, బీడబ్ల్యూఎఫ్‌ టూర్‌, ఇండోనేషియా ఓపెన్‌ టోర్నీతో సహా గ్రేడ్‌-2, గ్రేడ్‌-3 ఈవెంట్లు వాయిదాపడ్డాయి.

badminton hashtag on Twitter