ప్రముఖ నటుడు మోహన్‌బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణు కలిసి ఎనిమిది గ్రామాల్ని దత్తత తీసుకున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఎనిమిది గ్రామాల ప్రజలకు వీరు అండగా నిలిచారు. లాక్‌డౌన్ నేపథ్యంలో అక్కడ ఉన్న పేద కుటుంబాలకు రోజుకు రెండు పూటల ఆహారం సరఫరా చేస్తున్నారు. లాక్‌డౌన్‌ను తొలగించే వరకూ ఇలా ఆహారం పంపిణీ చేయబోతున్నారు. ఇది కాకుండా రోజుకు ఎనిమిది టన్నుల కూరగాయల్ని ఉచితంగా సరఫరా చేస్తున్నారు. దీంతో నెటిజన్లు వీరిని మెచ్చుకుంటున్నారు. మోహన్‌బాబు చిత్తూరులోని మొదుగులపాలెంలో జన్మించిన సంగతి తెలిసిందే. ఆ జిల్లాలోని రంగపేట సమీపంలో ఆయన ‘శ్రీ విద్యానికేతన్’ పేరుతో విద్యా సంస్థల్ని స్థాపించారు.
ఇంటి పేరు సార్థకం చేసుకున్న మోహన్‌బాబు
Related tags :